ఐఐటీయన్ల పార్టీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం - MicTv.in - Telugu News
mictv telugu

ఐఐటీయన్ల పార్టీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం

April 23, 2018

ఐఐటీల్లో చదువుకున్నవారు మంచి ఉద్యోగం చేస్తూ లక్షల్లో వేతనాలు  సంపాదిస్తుంటారు. కానీ అలాంటి బంగారు బాతుగుడ్ల ఉద్యోగాలను వదులకున్నారు 50 మంది ఐఐటీయన్లు.  వివిధ ఐఐటీల్లో చదువుకున్న వీరు బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాల కోసం బహుజన్ ఆజాద్ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. ఎస్పీ, ఎస్టీ, బీసీల హక్కుల కోసం పోరాడనున్నారు.‘మేం మొత్తం 50 మందిమి. లక్షల జీతాలిచ్చే ఉద్యోగాలను వదలేశాం. మా పార్టీకి గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాం. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ముందు మా సిద్దాంతాలను మారుమూల ప్రాంతాల్లోకి తీసుకెళ్లాలి. మొదట 2020 బిహార్ ఎన్నికలు మా లక్ష్యంగా పెట్టుకున్నాం. మా 50 మంది సభ్యుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాల వారికి చెందిన వారే. విద్య ,ఉద్యోగల్లో ఆ వర్గాలకు తగిన ప్రధాన్యత లేదని  మా అభిప్రాయం’ అని ఈ పార్టీ నాయకుడు నావెన్ కుమార్ అన్నారు. తాము ఏ పార్టీకి , సిద్ధాంతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

 ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో తమ లక్ష్యాల గురించి వివరిస్తున్న ఈ బృదం వేసిన పోస్టర్లలో  బీఆర్‌ అంబేడ్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, ఏపీజే అబ్దుల్‌ కలాం, మరికొంతమంది నాయకుల చిత్రాలు ఉన్నాయి. పార్టీ రిజిస్ట్రేషన్‌ పూర్తైతే  బృందాలుగా ఏర్పడి అన్ని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లాలన్నది వారి లక్ష్యం.