కేసీఆర్ నాకు భద్రత కల్పించాలి - MicTv.in - Telugu News
mictv telugu

  కేసీఆర్ నాకు భద్రత కల్పించాలి

September 11, 2017

తనకు వైశ్యుల నుంచి ప్రాణహాని ఉందని  ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’  పుస్తక రచయిత కంచ ఐలయ్య సోమవారం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుస్తకంపై అభ్యంతరాలున్నవారు కోర్టుకెళ్లి పరిష్కరించుకోవాలని అన్నారు. ‘నాకేమైనా జరిగితే ఆర్యవైశ్య సంఘాలే బాధ్యత వహించాలి. నేను దేశ పౌరుడిని. తెలంగాణలో ఉంటున్నాను. రాష్ట్ర ఓటరునైన నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి భద్రత కల్పించాలి’ అని ఐలయ్య డిమాండ్ చేశారు. ఈ పుస్తకం తన పరిశోధనల్లో ఒక భాగమని, దాన్నే ఇప్పుడు ప్రచురించారని వివరణ ఇచ్చారు. ‘నేనుఎవరినీ కించపరచలేదు. వాస్తవాలను మాత్రమే చెప్పాను. ఇందులోని విషయాలకు కట్టుబడి ఉన్నాను. ఎంతో పరిశోధించి ఈ పుస్తకం రాశాను. సామాజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాను’ అని ఆయన చెప్పారు.