కంచె ఐలయ్య అరెస్ట్.. ఖమ్మంలో ఉద్రిక్తత - MicTv.in - Telugu News
mictv telugu

కంచె ఐలయ్య అరెస్ట్.. ఖమ్మంలో ఉద్రిక్తత

December 3, 2017

‘సామాజిక స్మగ్లర్ల కోమటోళ్లు’ పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ సభలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఏపీతోపాటు తెలంగాణలోనూ ఆయన సభలపై పోలీసులు, వైశ్యలు, బ్రాహ్మణుల సంఘాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఆదివారం ఖమ్మంలో ఒక సభలో పాల్గొనడానికి వెళ్లిన ఐలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.సీసీఎం అనుబంధ తెలంగాణ గొర్రెలు, మేకల కాపరుల సంఘం రెండో రాష్ట్రమహాసభల్లో ప్రసంగించడానికి ఐలయ్య ఖమ్మం వెళ్లారు. ఈ సభకు పోలీసుల అనుమతి ఉంది. అయితే సభలో ఐలయ్య కూడా మాట్లాడతారని సమాచారం అందడంతో పోలీసులు అనుమతి రద్దు చేశారు. ఆయనను అరెస్ట్ చేశారు. దీనిపై సీపీఎం మద్దతుదారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశ రాజ్యమా అని ప్రశ్నిస్తున్నారు. బహిరంగ సభ నిర్వహించి తీరుతామని సభ నిర్వహకులు చెబుతున్నారు.