కంచె ఐలయ్యపై దాడికి యత్నం - MicTv.in - Telugu News
mictv telugu

కంచె ఐలయ్యపై దాడికి యత్నం

November 22, 2017

సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు.. ’ పుస్తక రచయిత కంచె ఐలయ్యపై ఆర్యవైశ్యులు భగ్గుమంటుండం తెలిసిందే. ఆయనను చంపేస్తామని హెచ్చరికలూ చేశారు. ఈ నేపథ్యంలో పుస్తకంపై నమోదైన కేసు విచారణ కోసం ఆయన బుధవారం జగిత్యాల జిల్లాలోని కోరుట్ల కోర్టుకు రాగా తీవ్ర ఉద్రికత్త నెలకొంది.

ఐలయ్య వచ్చారని తెలుసుకున్న ఆర్యవైశ్య సంఘాలు, వీహెచ్‌పీ, ఇతర బ్రాహ్మణ, హిందూ సంఘాల కార్యకర్తలు కోర్టుకు చేరుకుని వీరంగం చేశారు. విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు ఆయన కారును అడ్డుకున్నారు. మూతికి  నల్లగుడ్డలు చుట్టుకుని కారుకు అడ్డంగా పడుకున్నారు. కొందరు ఐలయ్యపై దాడికి యత్నించారు. కొందరు కోడిగుడ్లు విసిరారు. ఐలయ్య మద్దతుదారులు కూడా రంగంలోకి దిగి ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.

పరస్పర నినాదాలతో కోర్టు ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. పోలీసులు  ఐలయ్యను కారెక్కించారు. ఓ వైశ్యుడు ఆయన కారుపై చెప్పు విసిరారు. అతనిపై సీఐ రాజశేఖర్‌బాబు చేయిచేసుకున్నాడని వైశ్యులు మండిపడ్డారు. అంతకు ముందు ఐలయ్య బస చేసిన లాడ్జి వద్ద కూడా బీజేపీ కార్యకర్తులు నిరసనకు దిగారు.