‘కోమటోళ్లు’ పేరు మారుస్తా - MicTv.in - Telugu News
mictv telugu

‘కోమటోళ్లు’ పేరు మారుస్తా

September 12, 2017

వివాదాస్పదంగా మారిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకంపై ఆర్యవైశ్యుల చేస్తున్న ఆందోళనకు కంచ ఐలయ్య స్పందించారు. పుస్తకం పేరు మరీ అంత అభ్యంతకరంగా ఉంటే  మార్చడానికి సిద్ధంగా ఉన్నానని, వారితో చర్చలకు రెడీ అని చెప్పారు. ‘పుస్తకం రాసినప్పడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. వైశ్యులు ఇతర సామాజిక వర్గాలతో కలిసి వ్యాపారం చేస్తున్నారు. వారిపై ఇప్పుడు పుస్తకం రాయాల్సి వస్తే, మారిన పరిస్థితులకు తగినట్టుగానే రాస్తాను’ అని వివరణ ఇచ్చారు. తన పుస్తకంపై సుహృద్భావ వాతావరణంలో చర్చించాలని ఆయన వైశ్యులను కోరారు.

చంద్రబాబు సీరియస్

ఐలయ్య పుస్తకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వైశ్యుల నిరసన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్వేషాలను రెచ్చగొట్టేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి మంత్రి నారా లోకేష్ అన్నారు.