Ilaiyaraaja, PT Usha and Vijayendra Prasad nominated to Rajya Sabha
mictv telugu

రాజ్యసభకు నామినేట్ అయిన రాజమౌళి తండ్రి

July 6, 2022

Ilaiyaraaja, PT Usha and Vijayendra Prasad nominated to Rajya Sabha

ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ్యకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ట్వీట్ ద్వారా తెలియజేశారు. విజయేంద్ర ప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేశాయని ప్రశంసించారు. విజయేంద్రప్రసాద్తో పాటు రాజ్యసభకు నామినేట్ అయిన వారిలో.. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా , స్పోర్ట్స్ పర్సన్ పీటీ ఉషా, వీ హెగ్డే ఉన్నారు. తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. వీరిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేయడం విశేషం. రాష్ట్రపతి కోటాలో ప్రముఖులను నామినేట్ చేస్తున్నట్టు ప్రధాని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.