సెల్ఫీ కొట్టున్రి...లక్ష పట్టున్రి...! - MicTv.in - Telugu News
mictv telugu

సెల్ఫీ కొట్టున్రి…లక్ష పట్టున్రి…!

August 9, 2017

సెల్ఫీ దిగితే లక్ష ఎవలిస్తరని పర్శాన్ ఐతున్రా ? ఇందిరా క్యాంటీన్ లకు విస్తృత ప్రచారం కల్పించేందుకు బీబీఎంపీ వాళ్లు  సెల్ఫీ విత్ ఇందిరా క్యాంటీన్ కార్యక్రమం కింద గీ బంపర్ ఆఫర్ వెట్టిన్రు.కనీ గిది మనతాడ గాదు బెంగుళూర్ల.ఆగస్టు 15 నుంచి నగరవ్యాప్తంగా ఇందిరాగాంధీ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయట.ఇందిరా క్యాంటీన్‑లకు చేరుకోవడానికి వీలుగా బీబీఎంపీ అభివృద్ది చేస్తున్న మొబైల్ యాప్ మరో వారం రోజుల్లో  రానుంది. ఈ యాప్‑ను డౌన్‑లోడ్ చేసుకుని ఇందిరా క్యాంటీన్ ముందు సెల్ఫీ తీసుకొని అందుకు అనుబంధంగా ట్యాగ్‑లైన్  పెట్టి యాప్‑లో అప్‑లోడ్ చెయ్యాల్నట.

ఇలా పంపిన సెల్ఫీల్లో ఉత్తమ సెల్ఫీ కి  రూ. 1 లక్ష నగదు బహుమానాన్ని అందించనున్నట్లు బీబీఎంపీ ఆర్థికవిభాగం ప్రత్యేక కమీషనర్ మనోజ్ రాజన్ శెప్పిన్రు. ఆగస్టు 16న 106 ప్రాంతాల్లో ఇందిరా క్యాంటీలను ప్రారంభించనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇందిరా క్యాంటీన్‑లను ఆగస్టు 15వ తేదీన ప్రారంభిస్తారట. ఆగస్టు 16న బెంగళూరు నగరంలోని నేషనల్ కాలేజ్ క్రీడా మైదానంలో ఇందిరా క్యాంటీన్‑ల ప్రారంభోత్సవంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్  పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

ఇగ ఆగస్ట్ 15 న గ క్యాంటీన్లు ఓపెన్ కాంగనే అందరు ఫోన్లు పట్కొని తయ్యారు గుంటరు గావచ్చు. గ లక్ష మాకే రావాల్నని ..ఎన్ని సెల్ఫీలు దిగుతరో..ఎన్ని సార్ల గ యాప్ కు పంపుతరో పో.