ilavarasi daughter-in-law sucideattempt
mictv telugu

శశికళ ఇంట్లో ఏం జరుగుతోంది..

November 11, 2022

జయలలిత హయాంలో తమిళనాడు రాజకీయాలను అన్ని తానై నడిపించిన శశికళ.. తాజాగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జయలలిత మరణం తర్వాత జైలుకి పోవడం.. తర్వాత పార్టీలో పట్టుకోల్పోయి సతమతమవుతున్నారు. తాజాగా ఆర్ముగం కమిటీ రిపోర్ట్‌తో కూడా చిన్నమ్మ చిక్కుల్లో పడ్డారు. ఈ సమయంలో శశికళ కుటుంబలో మరో కుదుపు వచ్చింది. శశికళతో పాటు జైలు జీవితం అనుభవించిన ఆమె వదిన ఇలవరసి కోడలు తాజాగా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం తమిళనాట చర్చనీయాంశమైంది.

ఇలవరసి కొడుకు వివేక్ భార్య కీర్తన బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. భార్యభర్తల మద్య మనస్పర్థలు కారణంగానే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వివేక్‌కు తన సతీమణి కీర్తనతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వివేక్ వేధింపులను పలుమార్లు శశికళ, ఇలవరసి దృష్టికి కీర్తన తీసుకెళ్లినా పట్టించుకోలేదని సమాచారం. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆమె నిద్రమాత్రలను మింగి ఆత్మహత్యాయత్నం చేసారు. ఆపస్మారకస్థితిలో పడి ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం రాత్రి కూడా గొడవ జరిగినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఇప్పడు ఈ వ్యహారం తమిళనాడులో హాట్‌టాపిక్ అయ్యింది. శశికళ ఇంట్లో ఏం జరుగుతోందని అంతా చర్చించుకుంటున్నారు .ఇటీవల ఆర్ముగం కమిటీ రిపోర్ట్‌తో చిక్కుల్లో పడ్డ చిన్నమ్మకు ఈ ఘటన షాక్ అనే చెప్పాలి. శశికళకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలన్నీ వివేక్ కనుసన్నల్లోనే సాగుతాయనే ప్రచారం ఉంది.