హైదరాబాద్ లో ఇళయరాజా తొలి కచేరి!  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ లో ఇళయరాజా తొలి కచేరి! 

September 7, 2017

నవంబర్ 5 న హైదరాబాదు నగరం మాస్ట్రో ఇళయరాజా సంగీత సుగంధంలో ఉరకలెయ్యనుంది. గచ్చిబౌలిలోని అథ్లెటిక్ స్టేడియంలో ఈ ప్రదర్శన కన్నుల పండుగగా జరగనున్నది. నగరంలో తొలిసారి లెజెండరీ కంపోజర్ ఇవ్వనున్న సంగీత ప్రదర్శన ఇది. సంగీత అభిమానులకు ఇది శుభవార్త. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాదులోని తాజ్ బంజారాలో జరిగింది. ఇళయరాజా మాట్లాడుతూ ‘ నగరంలో ఇంత పెద్ద ఈవెంటు చెయ్యటం ఇదే ప్రథమం. ఇందులో గాయని చిత్ర, మనో, కార్తీక్, సాధనా సర్గమ్ తో పాటు మరి కొందరు గాయనీగాయకులు  పాల్గొంటారు. అలాగే 85 మంది మ్యూజిషియన్లు పాల్గొంటారు ’ తెలిపారు. ఇప్పటికే ఈ షో తాలూకు టికెట్స్ బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్ అయిపోతున్నాయట. టెంపుల్ బెల్, ఎంఎల్ఎన్ లు సంయుక్తంగా ఈ ఈవెంటును నిర్వహిస్తున్నాయి.