ఇళయరాజా దళితుడా? బ్రాహ్మణుడా? - MicTv.in - Telugu News
mictv telugu

ఇళయరాజా దళితుడా? బ్రాహ్మణుడా?

January 30, 2018

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు పద్మభూషణ్ అవార్డు రావడం తెలిసిందే. అయితే తమిళనాడులో ఇంకే సమస్యా లేనట్లు ఇప్పుడు ఆయన కులంపై రచ్చ చేసుకుంటున్నారు. ‘ఇళ‌య‌రాజా ద‌ళితుడు కావ‌డం వ‌ల్లే అత‌నికి ప‌ద్మ‌విభూష‌ణ్‌ వ‌చ్చింది’ అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక రాయడంతో గొడవ మొదలైంది. విమర్శలు రావడంతో తర్వాత క్షమాపణ చెప్పింది. ఆయనను కించపరచే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది.అయితే ఇళయరాజాతో కలసి పలు హిట్ సినిమాలు తీసి, తర్వాత దూరమైన దర్శకుడు భారతీరాజా మళ్లీ గొడవ రేపాడు. ఇళయరాజా ఆయన బ్రహ్మణుడిలా మారిపోవడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ‘ఆయన దళితుడు కావడం వల్లే అవార్డు వచ్చిందని అంటున్నారు. కానీ నిజం ఒకటుంది. ఆయన బ్రాహ్మణుడు కావాలని ట్రై చేస్తున్నారు. అందుకే ఆ పత్రిక అతణ్న దళితుడని గుర్తు చేసింది’ అని భారతీరాజా పేర్కొన్నారు.

దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇళయరాజాకు, భారతీరాజాకు చాలాకాలంగా వైరం ఉంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఇది అనుచితమని ఇసై రాజా అభిమానులు మండిపడుతున్నారు. మరోపక్క.. భారతీరాజా వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి హెచ్ రాజా స్పందించారు. ఇళయరాజా ఇప్పటికే బ్రాహ్మడు అయిపోయాడని ట్వీట్ చేశారు.