ఎల్వీ ప్రసాద్ మనవడు దాడి చేశాడు.. ఇళయరాజా ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

ఎల్వీ ప్రసాద్ మనవడు దాడి చేశాడు.. ఇళయరాజా ఫిర్యాదు

August 1, 2020

Ilayaraja lodged police complaint against lv prasad grandson on studio suit

దివంగత దర్శక నిర్మాత ఎల్వీ ప్రసాద్ వారసులకు, సంగీత దర్శకుడు ఇళయరాజాకు మధ్య సాగుతున్న వివాదం మరోసారి రోడ్డున పడింది. ఎల్వీ ప్రసాద్ మనవడు సాయిప్రసాద్ చెన్నైలోని ఎల్వీ ప్రసాద్ స్టూడియోలో ఉన్న తన గదిలో విధ్వంసం సృష్టించాడని ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయి, అతని అనుచరులు తన గదిలోకి చొరబడి సంగీత పరికరాలను, ఫర్నీచర్‌ను నాశనం చేశారని తెలిపాడు. వారిపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో స్టూడియోలోని తన ఆస్తిపాస్తులకు నష్టం కలగకుండా చూడాలని కోరారు. 

ఇళయరాజాపై అభిమానంతో ఎల్వీ ప్ర‌సాద్ 40 ఏళ్ల కిందట స్టూడియోలో ఒక సూట్ కేటాయించారు. అయితే ఆయనను అందులోంచి బయటికి పంపడానికి ఎల్వీ ప్రసాద్ వారసులు యత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్టూడియోను ఆధునీకరించడానికి మార్పులు చేస్తున్నామాని యాజమాన్యం చెబుతోంది. అయితే తనను గెంటేయడానికే వారు యత్నిస్తున్నారని సంగీత దిగ్గజం చెబుతున్నారు. దీనిపై మద్రాస్ హైకోర్టులో ఇప్పటికే కేసు నడుస్తోంది. కాగా, స్టూడియోలో ఇళయరాజా ఉండడానికి ఎల్వీ ప్రసాద్ కొడుకు రమేశ్ ప్రసాద్ అభ్యంతరం చెప్పకపోవడం విశేషం.