అంతెత్తు ఎగిరి పడుతున్న ఇలియానా... ఎందుకో తెలుసా...? - MicTv.in - Telugu News
mictv telugu

అంతెత్తు ఎగిరి పడుతున్న ఇలియానా… ఎందుకో తెలుసా…?

September 11, 2017

ఇలియానా  మస్తు గరం మీదున్నరు. అగ్గి మీద గుగ్గిలం అంటారుకదా అట్లా ఉన్నారు. దానికి సాక్ష్యం… ఆమె చేసిన  కామెంట్లే…. ఎక్కడికి వెళ్లినా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ గురించే అడుతున్నారట. అందుకే తాను పబ్లిక్ ఫిగర్ ను మాత్రమే తప్ప…. పబ్లిక్ ప్రాపర్టీ కాదని చెప్పారు.

మన దగ్గర  అవకాశాలు తగ్గాయనో లేక  పోతే  బాలీవుడ్ కు వెళ్లాలనో ఏమో కాని… అక్కడా  సూపర్ సక్సెస్ అయ్యారు.  ఇలియానా నటించిన బాద్ షాహో సిన్మా  కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది.  అయితే ఇలియానా ఏ ఫంక్షన్ కు వెళ్లినా తన బాయ్ ఫ్రెండ్ గురించే అడిగే వరకు చికాకు పడుతున్నదట. అడిగే వరకు ఓకే కానీ… అతడి జాతి గురించి… రంగు  గురించి మాట్లాడుతున్నారట. అందుకే అంత కోపం మట.