అభిమానిపై ఇలియానా గరం… - MicTv.in - Telugu News
mictv telugu

అభిమానిపై ఇలియానా గరం…

August 21, 2017

టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ లో కూడా మంచి మార్కులే తెచ్చుకుంది. ఎప్పుడూ అభిమానులతో సరదాగా ఉండే ఇలియానా ఓ అభిమానిపై కోపంతో ఊగిపోయింది. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ట్విటర్ లో తెలిపింది.  ‘మనం నీచమైన ప్రపంచంలో ఉంటున్నాం.  నేను ఓ సెలబ్రిటీని.  సామాన్యుల్లాగా నాకు ప్రైవసీ ఉండదని తెలుసు.  నేను పబ్లిక్ ఫిగర్ నే  తప్ప పబ్లిక్ ప్రాపర్టీని కాను. నాతో అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ  లేదు. ఎంతైనా నేనూ ఓ ఆడపిల్లనే’ అని ట్వీట్ చేసింది. .

బాలీవుడ్ తారలు విద్యాబాలన్, స్వర్ణా బాస్కర్ ఈ విషయం గురించి మీడియా ద్వారా వివరిస్తూ తామూ కూడా ఇలాంటి బాధితలమేనని తెలిపారు. ఇలియానా ప్రస్తుతం అజయ్ దేవగన్  సరసన బాద్ షాహో సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది.