అబ్బాయిలకు 5సెకన్లకోసారి అదే యావ... - MicTv.in - Telugu News
mictv telugu

అబ్బాయిలకు 5సెకన్లకోసారి అదే యావ…

May 25, 2017

టాలీవుడ్ లో ఓ వెలుగువెలిగిన “పోకిరి” పిల్ల కు పనిలేనట్లు ఉన్నట్టుంది. ట్విట్టర్ లో న్యూడి పిక్సే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ కామెంట్లు పెట్టేస్తోంది.
అబ్బాయిలు సెక్స్ గురించి ప్రతి ఐదు సెకన్లకు ఒకసారి ఆలోచిస్తారు’ అని ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. అబ్బాయిలు కేవలం సెక్స్ గురించే ఆలోచిస్తారు. కానీ, అమ్మాయిలు అలా కాదు ఆహారం, శృంగారం, చెప్పులు, బట్టల గురించి ఆలోచిస్తారని అంటోంది. ఇంకా అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారనే దానిపై అబ్బాయిలకు కొన్ని క్లూలు కూడా ఇచ్చేసింది. నేను ఎలాగైనా జిమ్‌కి వెళ్లాలి?. అతను నా ఫోటోకు ఎందుకు లైక్‌ కొట్టడం లేదు? ఇలాంటి విషయాలను కూడా అమ్మాయిలు తీవ్రంగా ఆలోచిస్తారని ఇలియానా చెబుతోంది.పెదవులకు ఇంజక్షన్‌ చేయించుకోవాల్సిన పని ఉందా?. నా ఇంటి పేరును మొదట పెట్టుకోవాలా లేక చివర్లో పెట్టుకోవాలా?. నా కనుబొమ్మలు ఎలా ఉన్నాయి?. ఈ రోత గోళ్లను నేను వదిలించుకోగలనా?. కొంచెం తొందరగా మందు కొడుతున్నానా? లాంటి విషయాలను ప్రతి ఐదు సెకన్లకు అమ్మాయిలు ఆలోచిస్తుంటారని ఇలియానా చెబుతోంది. అందుకే అమ్మాయిలు క్రేజీగా ఉంటారని అంటోంది. అమ్మడుకు సినిమాలు లేక అబ్బాయిలకు ఉచిత సలహాలు ఇస్తోంది. సో బాయ్స్ ఇంకేందుకు ఆలస్యం ట్విట్టర్ లో , ఇన్ స్టాగ్రామ్ లో ఇలియాను ఫాలో అవ్వండి…

View this post on Instagram

????

A post shared by Ileana D'Cruz (@ileana_official) on