మందు కోసం ఎస్ఐ కక్కుర్తి.. దొరికిన సరుకులో కిరికిరి - MicTv.in - Telugu News
mictv telugu

మందు కోసం ఎస్ఐ కక్కుర్తి.. దొరికిన సరుకులో కిరికిరి

September 18, 2020

Illegal liquor incident in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం రవాణా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల నుంచి కొందరు ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. వారిని పట్టుకోవడం ఏపీ పోలీసులకు సవాల్ గా మారింది. ఇదిలా ఉంటే పోలీసులు స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యానికి రక్షణ లేకుండా పోయింది. పోలీసులే అక్రమ మద్యాన్ని కాజేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 

ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన మద్యం సీసాలను జిల్లాలోని జంగారెడ్డిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఇటీవల సీజ్ చేసిన మద్యం బాటిళ్లలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. 24 బాటిళ్ల అక్రమ మద్యం చోరీ అయినట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిల్ స్థానంలోనే వేరే మద్యం బాటిల్స్ ఉంచినట్లు అధికారులు విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధం లేని మరో అయిదు మద్యం బాటిళ్లను కూడా వాటిలో పెట్టినట్టు గుర్తించారు. దీంతో జంగారెడ్డిగూడెం టౌన్ ఎస్సై గంగాధర్ పై కేసు నమోదు చేశారు.