లాక్‌డౌన్‌లోనూ మారని తీరు.. గుట్టుగా మద్యం విక్రయాలు  - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్‌లోనూ మారని తీరు.. గుట్టుగా మద్యం విక్రయాలు 

March 26, 2020

Illegally Selling Alcohol Man Arrested

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో నిత్యావసరాలు మినహా ఏవి అందుబాటులో ఉండటం లేదు. ఇది మందుబాబులకు కష్టంగా మారిపోయింది. చుక్కలేనిదే ముద్ద దిగని వారు చాలా మందే ఉండటంతో అటువంటి వారిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు అక్రమార్కులు. బయట అడుగు తీసి అడుగు వేసే అవకాశం లేకున్నా గుట్టుగా మద్యం విక్రయాలకు తెరలేపుతున్నారు. 21 రోజుల లాక్ డౌన్ క్యాష్ చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ఇంట్లో దాచి ఉంచి భారీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ప్రకాష్ నగర్‌‌లో అంజిరెడ్డి అనే వ్యక్తి తన ఫ్లాట్‌లో మద్యం అమ్ముతుండగా పట్టుకున్నారు. ఇంటి బాత్రూంలో ఎవరికీ తెలియకుండా భారీగా మద్యం దాచినట్టు గుర్తించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా ఇప్పటికే ఏపీలో బెల్టుషాపుల నిర్వాహణకు అనుమతి లేదు. అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున మద్యం ఎలా వచ్చిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.