కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదలో చెకప్ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదలో చెకప్

March 11, 2022

05

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాళ అస్వస్థకు గురయ్యారు. ఎడమ చేయి లాగుతున్నట్టు అనిపిస్తుందని చెప్పడంతో వైద్య పరీక్షల కోసం యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం డాక్టర్ ఎంవీ రావు మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు, నార్మల్ పరీక్షలు చేశాం.

ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. సీఎం గారికి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నం.
రొటీన్ పరీక్షల్లో భాగంగానే చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం. వారు స్టేబుల్ గా ఉన్నారు. ఇది కేవలం ప్రివెంటివ్ చెకప్ మాత్రమే.’ నని వెల్లడించారు.
సమాచారం తెలిసిన వెంటనే కేటీఆర్, హరీష్‌రావులు ఆసుపత్రికి చేరుకున్నారు. అస్వస్థత నేపథ్యంలో ముఖ్యమంత్రి యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్నారు.