నంద్యాలలో పాడైన గుడ్లు తిని విద్యార్థుల అస్వస్థత - MicTv.in - Telugu News
mictv telugu

నంద్యాలలో పాడైన గుడ్లు తిని విద్యార్థుల అస్వస్థత

March 11, 2022

23

నంద్యాల పట్టణంలోని విశ్వనగర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. గమనించిన సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే డీఈవో వచ్చి విద్యార్ధులను పరామర్శించారు. పాడైపోయిన గుడ్లు పెట్టిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. భయపడాల్సిందేమీ లేదని, చికిత్స తర్వాత విద్యార్థలను డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు.