గంగవ్వకు అస్వస్థత.. కరోనా పరీక్ష! - MicTv.in - Telugu News
mictv telugu

గంగవ్వకు అస్వస్థత.. కరోనా పరీక్ష!

September 17, 2020

Illness to Gangava .. Corona test!

కరోనా సమయంలో తీసుకోవాల్సిన అన్నీ జాగ్రత్తలతో బిగ్‌బాస్ సీజన్ 4 ప్రారంభం అయింది. షోలో పాల్గొనే కంటెస్టెంట్ల‌ను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, అంద‌రికీ ప‌రీక్ష‌లు చేశాక నెగెటివ్ అని తేలితేనే లోనికి పంపించారు. కరోనా కారణంగా తక్కువ మంది సిబ్బందితో కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఆ కొద్దిమంది కరోనా నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నారు. ఇంట్లో అందరూ చక్కగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. దీంతో కన్ను కుట్టిన కరోనా మహమ్మారి పంజా విసిరింది. తాజాగా షోలో ప‌నిచేసే కొంద‌రు టెక్నీషియ‌న్ల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వ ఇంట్లోనూ కాస్త అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు క‌నిపిస్తోంది. కొద్ది రోజులుగా ‘నేను ఇంటికి వెళ్లిపోతా.. నా మనవళ్లను, మనవరాళ్లను చూడాలని ఉంది’ అని గంగవ్వ అంటున్న విషయం తెలిసిందే. అయితే నాగార్జున పంపలేం అన్నట్టు మాట్లాడారు. నువ్వు ఇంట్లో ఉండాలన్నా, పోవాలన్నా డిసైడ్ చేసేది ప్రేక్షకులు అని చెప్పారు. అయితే టెక్నీషియ‌న్ల‌కు క‌రోనా సోకడంతో ముందు జాగ్ర‌త్త‌గా గంగ‌వ్వ‌కు కూడా కోవిడ్‌-19 ప‌రీక్ష చేయించార‌ట‌. ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందంటున్నారు. ఈ నేప‌థ్యంలో అప్రమత్తమైన షో నిర్వ‌హ‌కులు మ‌రిన్ని క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మయ్యారు. కాగా, గంగ‌వ్వ వ‌రుస‌గా రెండోసారి కూడా ఎలిమినేష‌న్ లిస్టులో ఉంది. కానీ, ప్రేక్షకులు ఆమెకు విపరీతంగా ఓట్లు వేస్తున్నారు. ఇంట్లో ఉండ‌లేన‌ని మాటిమాటికీ చెప్తుండ‌టంతో బిగ్‌బాస్ నిర్వాహ‌కులే ఓ అడుగు ముందుకేసి ఆమెను త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు పంపించేందుకు ఆలోచ‌న చేస్తున్నారని సమాచారం.