క్రీస్తుపై ఇళయరాజా వివాదాస్పద వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

క్రీస్తుపై ఇళయరాజా వివాదాస్పద వ్యాఖ్యలు

March 28, 2018

ఏసుక్రీస్తుపై ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. ‘క్రీస్తు పునరుత్థానాకి ఆధారాల్లేవు. కేవలం రమణ మహర్షి మాత్రమే చనిపోయాక మళ్లీ బతికొచ్చారు. అది కూడా కేవలం 16 వయసుకే. క్రీస్తు మళ్లీ బతికొచ్చాడని చెప్పేందుకు ఆధారాలు లేవు. రమణ మహర్షి జీవించినట్లు జీవించిన మరో సాధువు ఈ ప్రపచంలో లేడు’ అని ఆయన ఓ టీవీ చానల్‌తో అన్నారు.ఈ వ్యాఖ్యలపై తమిళ క్రైస్తవ సంఘాలు మండిపడుతున్నాయి. ఇళయరాజాను వెంటనే అరెస్ట్ చేయాలని సిరుప్పన్మయ్ మక్కల్ నాల కచ్చి సంస్థ డిమాండ్ చేసింది. టీ.నగర్‌లోని ఆయన నివాసం వద్ద ధర్నా నిర్వహించింది. క్రీస్తు చనిపోయి మళ్లీ బతికొచ్చాడన్న తమ మనోభావాలను ఈ సంగీత దర్శకుడు ఘోరంగా అవమానించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.