'ఈ బుజ్జి తల్లి వల్లే నేను బతికున్నా': సాయి ధరమ్ తేజ్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఈ బుజ్జి తల్లి వల్లే నేను బతికున్నా’: సాయి ధరమ్ తేజ్

March 26, 2022

bnm

టాలీవుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో యాక్సిడెంట్‌కు గురై, తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సందర్భంగా శనివారం సాయి ధరమ్ తేజ్ ఓ వీడియో ద్వారా అభిమానులతో మాట్లాడారు. దీంతో ఆయన అభిమానులు తమ హీరో పూర్తిగా కోలుకొని, ఆరోగ్యంగా కనిపించడంతో  ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ”హాలో అండీ.. అందరూ బాగున్నారా. మొదటగా నన్ను ఆసుపత్రిలో చేర్చిన సయ్యద్ అబ్దుల్ ఫరక్‌కీ ప్రత్యేక ధన్యవాదాలు. మానవత్వం ఇంకా బతికి ఉందంటే దానికి నిలువెత్తు నిదర్శనం మీరే బాయ్. అలాగే, ఆసుపత్రిలో నన్ను చాలా జాగత్త్రగా చూసుకున్న డాక్టర్లకు, అక్కడి స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. ఆ తర్వాత నా కుటంబ సభ్యులైనా మోగా ఫ్యామిలీకి, ఆ తర్వాత నా రెండవ కుటంబమైనా సినీ ఇండస్ట్రీ పెద్దలకు, నా మూడవ కుటంబమైనా అయిన నా అభిమానులకు చాలా చాలా ధన్యవాదాలు” అంటూ ఎమోషనల్ అయ్యాడు.

అంతేకాకుండా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం త్వరలోనే ఓ కొత్త సినిమాను చేయబోతున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో ‘ఈరోజు నేను బతికి ఉన్నానంటే దానికి ముఖ్యమైన కారణం ఈ బుజ్జి తల్లి (హెల్మెట్) వల్లే బతికి బయటపడ్డాను’ కావున ప్రతి ఒక్కరు ఏ చిన్న పనికోసం బయటికి వెళ్లినా, హల్మెట్‌ను మాత్రం పక్కాగా ధరించాలని కోరాడు. మరోపక్క తేజ్ చేసిన వీడియోలో ఆయన ఇంకా నీరసంగానే కన్పిస్తుండడం కొంతవరకు అభిమానులను ఆందోళనకు గురిచేసింది.