పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ‘నేను గాడిదను’ అంటూ తనపై తానే ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకున్నారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్ 10వ తేదీన దిగిపోయారు. ఆ తర్వాత ఆయన యూకే పర్యటనకు వెళ్లి వచ్చారు. అనంతరం ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇమ్రాన్ ఖాన్ తన మీద తానే ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకున్నాడు.
Without comment. pic.twitter.com/l0Jwpomqvp
— Hasan Zaidi (@hyzaidi) May 6, 2022
ఆ వీడియోలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ..”నేను యూకేకి వెళ్లినప్పుడు సాదర ఆహ్వానమే దక్కింది. కానీ యూకేను నేను ఎప్పుడూ నా సొంత దేశంగా అనుకోలేదు. ఎందుకంటే నేను పక్కా పాకిస్థానీనని. ఒక గాడిదకు చారలు పెట్టినంత మాత్రాన అది కంచర గాడిద అయిపోదు. గాడిద ఎక్కడున్నా గాడిదే” అని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. కాగా, పదవిని కోల్పోయినప్పటి నుంచి పాకిస్థాన్ నెటిజన్లు ఇమ్రాన్ ఖాన్ పాత వీడియోలను పోస్ట్ చేస్తూ అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు.