‘హిందువులు, క్రిస్టియన్లు కూడా గోమాంసం తింటారు’ - MicTv.in - Telugu News
mictv telugu

‘హిందువులు, క్రిస్టియన్లు కూడా గోమాంసం తింటారు’

May 24, 2022

గోమాంసంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని, ఇప్పటివరకు గోమాంసం తినలేదని, తినాలనిపిస్తే తింటానని చెప్పి వివాదానికి తెర లేపారు. సోమవారం తుమకూరులో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ… తాను ఏం తినాలనేది తన సొంత నిర్ణయమన్నారు. కేవలం ముస్లింలు మాత్రమే గోమాంసం తీసుకోరని, హిందువులు, క్రిస్టియన్లు కూడా తింటారన్నారని చెప్పారు. ఎవరెవరి ఆహార పద్ధతి వారి సొంత నిర్ణయమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్) మతాల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తోందని ఆరోపించారు.

దేశంలో 1964 నుంచే గోవధ నిషేధ చట్టం ఉందని, వాటికి సవరణలు చేసి చట్టం తెచ్చారన్నారు. కానీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాత చట్టాన్ని తీసుకొచ్చానన్నారు. ఇటీవల బీజేపీ ప్రభుత్వం మరోసారి మార్పు చేసిందన్నారు. గతంలో అసెంబ్లీలో కూడా ఆహార పద్ధతి పట్ల చట్టం చేయడం సరికాదని చెప్పిన సంగతిని గుర్తు చేశారు.