దేవుడు చేసిన మనుషుల - MicTv.in - Telugu News
mictv telugu

దేవుడు చేసిన మనుషుల

July 22, 2017

దునియా.. మేల్,ఫిమేల్ మేళా

బస్ ఇంతేనా …ఇంకేం లేదా

జగన్నాటకంలో కొత్త పాత్రలు

న్యూ ఈక్వెషన్స్

జండర్ ఝంజాటాల పజిల్

హిజ్రా…..

లింగ భేదంలో నలిగిపోతోన్న సమూహం

దేవుడు చేసిన మనుషుల

సృష్టి ఒక గీత గీసింది…మనిషై పుట్టిన ప్రతి వాడూ ఆ గీతకు అటో ఇటో ఉండాలి. అంతే తప్ప, అటు సగం…ఇటు సగం ఉండేందుకు వీలు లేదు. అది సృష్టి ధర్మం.కానీ… కాని ఆ లైన్ కు ఇటు దేహం, అటు మనస్సుతో బతుకుతున్న వాళ్లూ ఉన్నారు.. కాలరెగరేస్తూ…నేను మగాణ్ణి అని చెప్పుకోలేక….ఎదపై తన్నుకొచ్చిన కొత్త అందాలతో స్త్రీ అని సంబరపడలేక సతమతమయ్యేవాళ్లూ చాలా మందే…అలాంటి వారే హిజ్రాలు…వాళ్ల ప్రపంచాన్ని…అక్కడి చీకటి వెలుగుల్ని చూపించే ప్రయత్నం ఈ స్టోరీ.

మన పుట్టుక మన చేతుల్లో లేదు…క్లియర్ గా చెప్పాలంటే మనం ఎలా పుట్టామన్నది మనం సాధించిన ఘనత కూడా కాదు.. ఈ ఈక్వేషన్ ను సరిగ్గా అర్థం చేసుకోలేని సమాజం హిజ్రాలను ఈసడించుకుంది… కడుపులో పెట్టుకు చూసుకోవాల్సిన కన్నపేగూ కనికరం చూపలేదు…ఇంటి నుండి గెంటేసింది.. అయితే ఏంటీ ఛల్ ఫుట్ అంటూ ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నారు..తమలాంటి వారితో బతుకు బండి లాగిస్తున్నారు .మేల్ మిస్సమ్మల మాదిరి జీవిత సాగరాన్ని ఈదుతున్నారు…

 

హిజ్రా అంటే తిరస్కారానికి, నిరాదరణకు పర్యాయపదం. కానీ వీరికి మాత్రం అవే అక్షింతలు, ఆశీర్వచనాలు… ఇక అందంగా కనిపించే వీళ్ల జీవితాల్లో అనేక చీకటి కొణాలున్నాయి… పుట్టుకతో వీళ్లు హిజ్రాలు కాదు. అమ్మకడుపులో అమ్మాయి గానో అబ్బాయిగానో జీవం పోసుకుంటారు..పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి వీరి ప్రవర్తనలో మార్పులొస్తాయి.. మగా పిల్లలుగా అవయవాలు కలిగి ఉండి అడపిల్లలతో తిరగడం., ఇంటి పని చేయటం , అమ్మాయి లాగా డ్రెస్సులేసుకోవడం వంటి లక్షణాలు వీళ్లను మిగతా వారి నుండి దూరం చేస్తాయి….కుటుంబ సభ్యులు అసహ్యసించుకుంటారు..ఇంటి నుంచి గెంటి వేస్తారు..ఇంట్లో శిఖండి ఉందంటే పరువు ఎక్కడ పోతుందోనని వారి భయం..ఇలా కన్న వారి వేధింపులు,ఇరుగు పోరుగు వెక్కిరింతలకు దూరంగా తమ లాంటి వారి చెంతకు చేరుతారు..మరో ప్రపంచంలో ఎంటరవుతారు..ఇక్కడ అందరు శిఖండులే ఉంటారు. వీళ్లు బృందాలుగా జీవిస్తారు . వీళ్ల కుటుంబంలో అమ్మ,నాన్న , చెల్లి అనే రిలేషన్స్ ఉండవు. అంతా గురు శిష్యుల బంధమే …ఇక వీరి దిన చర్య చాలా విచిత్రంగా ఉంటుంది. అందరిలా వీరు పొద్దున్నే లేవరు. మధ్యాహ్నం పన్నెండు తరువాత స్టార్ట్ అయ్యే వీరి డే  ఆర్ధరాత్రి రెండు గంటల వరకు సాగుతోంది.

అచ్చం అడపిల్ల లాగే కనిపించే  ఈ హిజ్రాలు మాంచి అందగత్తలు…బ్యూటీకి వీరిచ్చే ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు..ముఖానికి మేక్ అప్ లేకుండా వీళ్లు అస్సలు బయటకు రారు.. మేక్ అప్ చేసుకొవడం వెనుక ఓ ఇంటెన్షన్ కూడా ఉంది.. తాము హిజ్రాలమని తెలియకుండా రూపాన్ని మార్చుకొనే ప్రయత్నమది..ఇంతేకాదు కుటుంబానికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనన్న అనుమానం…ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ ను కలుసుకొడానికి వాళ్ల ఇండ్లకు పోయినప్పుడు అసలు రూపంలోనే పోతారు…కుర్తా, పైజామా లేదా ప్యాంటు ,షార్ట్ లోనే వెళుతారు…ఇక హిజ్రాలకు ప్రత్యేక మైన భాష ఉంది..అదే ఫర్శి ..మనసు విప్పి మాట్లాడుకోవాలంటే ఫర్శిలోనే.. ఇతరులకు తమ మాటాలు ఆర్థం కాకుండా ఉండటం కోసం వీళ్లు సృష్టించుకున్నదే ఈ  భాష..దీంతో పాటు తెలుగు , హిందీ, ఉర్థూ బాషలను అనర్గళంగా మాట్లాడుతారు. కానీ తెలుగు మాట్లాడే వారితో హిందీలో, హీందీ మాట్లాడే వారితో తెలుగులో మాట్లాడటం వీరి ప్రత్యేకత. .ఇలాచేయటం వెనుక ఒక కారణం ఉంది. తమను తమ ప్రాంతాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటం.

ఏ మతంలో  ఏ కులంలో పుట్టిన అన్ని కులలు, మతాలు తమవే అంటారు హిజ్రాలు..సర్వ మతాలను అచరిస్తారు. అన్ని పండుగలను జరుపుకుంటారు. రంజాన్, దీపావళి , క్రిస్టమస్ , ఇలా ఏ పండుగ వచ్చిన సంబరమే సంబరం… దైవం దగ్గరికి వెళ్లేటపుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. ఎప్పుడ పడితే అప్పడు గుడికి,మస్జిద్ ,చర్చి కి వెళ్లరు.. ఒక వేళ పోవాల్సి వస్తే దేవుడికి పది అడుగుల దూరంలో ఉంటారు. దైవ ప్రార్థన చేసేటపుడు మేకప్ వేసుకోరు..నిష్ట , నియమాలను పాటిస్తారు… పూజ టైంలో కానీ నమాజ్ టైమ్ లో కానీ కుర్తా, లుంగి ధరించాలని నియమం పెట్టుకున్నారు…ఇక కొత్తగ హిజ్రా అవుదామనుకునేవారిని చాలా ప్రేమగా చూసుకుంటారు..వారికి కావలసిన శిక్షణలను వారి రంగంలో ఇస్తారు. అంతేకాదు ఆర్థికంగా స్థిరపడే వరకు వారి బాగోగులన్ని వెల్ సెటిల్డ్ హిజ్రాలే చూసుకుంటారు….

హిజ్రాలూ ప్రేమలో పడుతారు. వీరికీ మనసుంటుంది.. వీరు అడవాళ్ల కంటే మగా వాళ్లనే ఇష్ట పడుతారు. కానీ పెళ్లి చేసుకొరు.

హిజ్రాలకు లోకజ్ఙానం లేదని, మానసిక స్థితి సరిగా ఉండదని, చదువూ సంధ్యా అసలే ఉండవని అనుకుంటే పొరబాటే.. వీళ్ళలో డిగ్రీ, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేసిన విద్యావంతులు చాలా మందే ఉన్నారు…లీడర్ షిప్ క్వాలిటీస్ తో హిజ్రాల సమస్యలపై పోరాడుతున్నవారూ ఉన్నారు….టీవీ యాంకర్ రోజ్ ,లైలా,మణిమేఘల, కాంచన లు అలాంటివారే…అంతటా ఉన్నట్టే వీళ్లనూ నకిలీల బెడద పట్టిపీడుస్తోంది…హిజ్రాలలో డూప్లికేట్లు కూడా ఉంటారు.వాళ్లను బహురూపులని పిలుస్తారు. వాళ్ల ఆగడాలతో సమాజంలో తమకు చెడ్డ పేరు వస్తోందని హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

హిజ్రాలకు తాము చాలా బలవంతులమన్న ఓ నమ్మకం ఉంది..ఒక్క హిజ్రా దగ్గర పది మంది మగావాళ్ల శక్తి ఉంటుందని చెపుతారు…మగ వాళ్ల  ఫిజిక్ అడవాళ్ల మనసు వీరి ప్రత్యేకం….ఒక్కొక్క హిజ్రాకు అనేక మారుపేర్లు ఉంటాయి. తల్లిదండ్రులు పెట్టిన పేర్లను ఉంచుకొటానికి వీళ్లు అసలు ఇష్టపడరు.స్వప్న, మీన, పింకి , సోని , రేష్మ, సన్ని, జూలి, ఇలా నార్త్ ఇండియన్ స్టైల్లోనే నేమ్స్ ఉంటాయి….

సౌత్ ఇండియాతో పొలిస్తే ఉత్తరభారతంలో హిజ్రాలకు కాస్త గౌరవం ఉంది..అక్కడ పెండ్లిల్లు,పేరంటాలు,బారసాలల్లో హిజ్రాలే స్పెషల్ గెస్ట్ లు…కోరినంత డబ్బిచ్చి మరీ వేడుకలకు పిలుపించుకుంటారు..అయితే మన దగ్గర మాత్రం వీళ్లకు అంత ఆదరణ లేదు…ఇక సమాజం నుండి అడుగడుగునా ఛీత్కారాలను చవిచూస్తున్న హిజ్రాలు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు…ప్రత్యేక వసతి గృహాలను నెలకొల్పి ఉన్నత విద్యను అందించాలంటున్నారు.. ప్రత్యేక చట్టాలు, రిజర్వేషన్లు అమలు చేయాలి. సమాజంలో ఉన్న ఈ లింగవివక్షను రూపుమాపుతూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు…

ఉదయం నిద్ర లేచింది మొదలు… రాత్రి నిద్రపోయే వరకూ అవమానాలు, హింసలు, వేధింపులు, చీదరింపులు.. అన్నింటినీ సహిస్తూ జీవశ్చవాల్లా బతుకుతున్నారు హిజ్రాలు…మనిషి మేధస్సు ఆటవికయుగం నుంచి కంప్యూటర్‌యుగానికి ఎదిగినా తమను మాత్రం జంతువుల కన్నా హీనంగా చూస్తున్న సమాజాన్ని ఏమనాలని హిజ్రాలు ప్రశ్నిస్తున్నారు.. ఎలాంటి రక్షణ, ఓదార్పు, ఆదరణ లేకుండా బతుకుతున్న తమ గోడును పట్టించుకొనే నాధుధే లేడా అని ప్రశ్నిస్తున్నారు..

పైకి కనిపించే  నవ్వుల వెనుక రోదనలున్నాయి…ఎవరేమన్నా టేకిటీజీగా తీసుకునే క్యారక్టరైజేషన్ వెనుక అంతులేని ఆవేదనుంది…ఆ కవ్వింపుల వెనుక ఆత్మాభిమానాలను ఫణంగా పెడుతోన్న నిస్సహాయత దాగి ఉంది..కాస్త జాలి, ఇంకాస్త దయా, మరికాస్త అభిమానం…ఇవి చాలు…వీరికి…జీవితమనే నాటకానికి హ్యాపీ ఎండింగే ఉండాలని హిజ్రాలు కోరుకుంటున్నారు…అది తప్పేం కాదు…సో మనవంతుగా వారికి చేయూతనిద్దాం….