గతకొన్ని రోజులుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పారిపోయడని, అతడు రష్యా బలగాలు చేస్తున్న దాడులకు భయపడి పోలండ్‌కు వెళ్లిపోయాడని రష్యన్ మీడియాలు కథనాలు రాస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం ఓ అధికారితో కలిసి ఉన్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విడుదల చేశారు. ”రష్యా మీడియాలు నా గురించి రాస్తున్న కథనాలన్నీ అవాస్తవం. నేను ఎక్కడికి పారిపోలేదు. కీవ్‌లోని నా కార్యాలయంలోనే ఉన్నాను” అంటూ జెలెన్ స్కీ స్పష్టం చేశారు.
అయితే, గతంలో జెలెన్ స్కీ అతని కుటుంబం ఉక్రెయిన్ విడిచి ఇతర దేశాలకు వెళ్లారని కథనాలు వచ్చాయి. పలు దేశాలు మా దేశానికి రండి మీకూ రక్షణ కల్పిస్తాం అంటూ జెలెన్క్ సీకి ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 24న రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన ఓ విడుదల చేశాడు. మళ్లీ ఈరోజు మరో విడుదల చేశారు. అంతేకాకుండా జెలెన్ స్కీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఆయనతోపాటు ఓ అధికారి కనిపిస్తున్నారు. ఇది కీవ్‌లోని తన కార్యాలయమని, తాను కీవ్‌లోనే ఉన్నాను. ఇక్కడే పని చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.
మరోపక్క శనివారం రష్యా ఇతర దేశాల ఒత్తిడి చేయడంతో తాత్కలికంగా కాల్పులు విరమించుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇప్పటికే ప్రధాని మోదీ పుతిన్‌కు ఫోన్ చేసి భారతీయులను సురక్షితంగా బయటకొచ్చేందుకు సేఫ్ ప్యాసేజ్ కల్పించాలని కోరాడు.