నేను ‘ముప్పావలా’ సినిమా తీయట్లేదు.. వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

నేను ‘ముప్పావలా’ సినిమా తీయట్లేదు.. వర్మ

January 17, 2020

Verma.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో దోస్తీ చేయడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా విమర్శలు ఊపందుకున్నాయి. ‘చెగువేరా అన్నావు.. భగత్ సింగ్ అన్నావు.. మోసం చేశావ్’ అంటూ ఎవరికి తోచినట్టు వారు స్పందిస్తున్నారు. ఈ గందరగోళంలో ‘పాము అంటే పడగ’ అన్న తీరుగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్‌పై ‘ముప్పావలా’ సినిమా చేస్తున్నాడని ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వర్మ ట్వీట్ చేసి, డిలీట్ చేశాడనే ప్రచారంతో, స్క్రీన్ షాట్ వైరల్‌గా మారింది. ఇది పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తీస్తున్న సినిమా అని పోస్టర్ చూస్తేనే అర్థమైపోతుంది. 

అయితే దీనిపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్‌లో వర్మను బండ బూతులు తిట్టేశారు. కొన్ని వెబ్‌సైట్లు ఈ వార్తను దృవీకరించాయి. ఇదిలావుండగా వర్మ తాను ఈ సినిమా చేయట్లేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ ట్వీట్ తాను చేయలేదని వివరణ ఇచ్చాడు. 
మార్ఫింగ్ చేసిన ఇమేజ్‌ను ఎవరో తన పేరుతో పోస్ట్ చేశారని, దీనితో తనకు ఎలాంటి సంబంధం లేదని వర్మ తన ట్వీట్‌లో స్పష్టంచేశాడు. ఎవరికైనా అనుమానాలు ఉంటే తన ట్వీట్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చని చెప్పాడు. 

కాగా, వర్మ ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’  సినిమా తీయడంతో ఈ ‘ముప్పావలా’ సినిమా కూడా తీస్తున్నాడని అందరూ నమ్మేశారు. ఇలాంటి వివాదాలు వర్మకు సరదా అనుకున్నారు. అదంతా ఫేక్ రాయుళ్ల సృష్టి అని తెలిసి నెటిజన్లు నాలుక కరుచుకుంటున్నారు.