నాకు ఎలాంటి వ్యక్తి అయినా ఓకే..యువతి - MicTv.in - Telugu News
mictv telugu

నాకు ఎలాంటి వ్యక్తి అయినా ఓకే..యువతి

May 16, 2022

నల్లటి మాస్కు ధరించి ఓ యువతి.. ప్లకార్డు చేతబట్టి, నాకు వరుడు కావాలి అంటూ రోడ్డుపై నిల్చున్న యువతి ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సామాన్యంగా పెళ్లి విషయంలో తల్లిదండ్రులు అమ్మాయికి మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తారు. కానీ, సుడాన్‌ దేశంలో యువతులే రోడ్లపైకి వచ్చి తమ భర్తలను వెతుక్కునే పనిలో పడ్డారు.

‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వరుడు కావాలి. గతంలో పెళ్లి అయిన వ్యక్తిని చేసుకోవడానికి కూడా నేను సిద్ధమే. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు నన్ను సంప్రదించండి” అనే వ్యాఖ్యాలతో కూడిన ప్లకార్డును చేతపట్టుకుని సూడాన్‌ రోడ్డుపై ఫోన్ నెంబర్ రాసి ఆ యువతి నిల్చుంది. దాంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఆశ్యర్యానికి లోనై ఫొటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ యువతి వార్తల్లో నిలిచింది.

మరోపక్క 2018-20 మధ్య సూడాన్‌లో మ్యారెజ్‌ల రేటు గణనీయంగా తగ్గిందట. 2018తో పోల్చితే 2020 సంవత్సరంలో మ్యారెజ్ రేటు 21శాతం పడిపోయిందట. 2020లో ఒకేసారి 60 వేలకు పైగా జంటలు విడాకులు తీసుకున్నాయట. ఆ కారణంగానే సుడాన్‌లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అక్కడి నిపుణులు తెలిపారు.