I'm sorry..cancelling all: Kiccha Sudeep
mictv telugu

నన్ను క్షమించండి..అన్ని క్యాన్సిల్ చేస్తున్నా: కిచ్చా సుదీప్

July 21, 2022

కన్నడ స్టార్ హీరో సుదీప్ కిచ్చా ‘నన్ను క్షమించండి’ అంటూ టాలీవుడ్, కోలీవుడ్ మీడియా మిత్రులను కోరారు. ‘విక్రాంత్ రోణ’కు సంబంధించి నేడు జరగాల్సిన ప్రెస్‌మీట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నానని గురువారం ట్విటర్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం సరిగా లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.

”అనారోగ్యం కారణంగా ఈరోజు హైదరాబాద్, చెన్నై, కొచ్చిలో జరగాల్సిన ప్రెస్‌మీట్స్ అన్నిటిని రద్దు చేస్తున్నా. ఎందుకంటే ఈ అనారోగ్యం కారణంగా ప్రయాణాలు చేయలేకపోతున్నా. మీడియా మిత్రులందరికీ క్షమాపణలు చెబుతున్నా. కోలుకొన్న వెంటనే ప్రెస్‌మీట్స్‌లో మళ్లీ పాల్గొంటా. త్వరలోనే మీ అందర్నీ కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నా.” అని ఆయన ట్విట్‌లో రాసుకొచ్చారు.

ప్రస్తుతం సుదీప్ కిచ్చా కోసం ఓ భారీ ప్రాజెక్ట్ సిద్ధమైంది అదే ‘విక్రాంత్ రోణ’. ఈ సినిమాను దర్శకుడు అనూప్ బండారి తెరకెక్కించారు. సోషియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో ఈ సినిమా జులై 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్, సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్లలో ప్రెస్‌మీట్స్ నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. కానీ, సుదీప్ అనారోగ్యానికి గురి కావడంతో రద్దయ్యాయి.