నన్ను క్షమించండి: జూ. ఎన్టీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను క్షమించండి: జూ. ఎన్టీఆర్

May 21, 2022

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు క్షమాపణలు చెప్తూ ఆయన ఓ ఎమోషనల్‌ లేఖను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ లేఖలో..”నా పుట్టిన రోజు (మే 20)న ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయాను. అందుకు వారికి క్షమాపణలు. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. అందుకే కలవడం కుదరలేదు. ఈ విషయంలో మీ అభిమానాన్ని మిస్ చేసుకున్నాను. నన్ను క్షమించండి. నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. విషెస్‌ చెప్పడానికి చాలా దూరం నుంచి మా ఇంటికి వచ్చిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపున్నాను. మీ రుణం ఎప్పుడూ తీర్చుకోలేను. మీరు చూపించే ప్రేమకు ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను.’ అంటూ జూ. ఎన్టీఆర్ ఎమోషనల్‌ లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

 

ఇటీవలే తమ అభిమాన హీరో ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఫ్యాన్స్ (మే 20) తాండోపతండాలుగా ఎన్టీఆర్ ఇంటి దగ్గరకు చేరుకొని హంగామా చేసిన విషయం తెలిసిందే. జై ఎన్టీఆర్ అంటూ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి, కేక్‌ను కట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి ఫ్యాన్స్ ఎంత చెప్పిన వినకుండా గంటల తరబడి రోడ్డుపైనే ఉండడంతో హైదరాబాద్‌ పోలీసులు వారిపై లాఠీచార్జ్‌ చేశారు. ఆ ఘటనకు సంబంధించి జూ. ఎన్టీఆర్ స్పందిస్తూ అభిమానులకు క్షమాపణలు కోరారు.