సిగ్గుపడేవాడు రాజకీయ నేత కాలేడు.. దేవగణ్ - MicTv.in - Telugu News
mictv telugu

సిగ్గుపడేవాడు రాజకీయ నేత కాలేడు.. దేవగణ్

May 14, 2019

సినిమావాళ్లు రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణమే. అన్నీ భాషల నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. బాలీవుడ్‌ విషయానికి వస్తే సీనియర్ల విషయం పక్కనపెడితే ఈమధ్య ఊర్మిళ, సన్నీ డియోల్‌ రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ల మాదిరి కండల హీరో విజయ్ దేవగణ్ కూడా రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారని మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన చిత్రమైన సమాధానం చెప్పారు. తనకు రాజకీయాలంటే సిగ్గు అని అని సమాధానం చెప్పాడు.

I’m too shy for politics Ajay Devgn on why he may not be an ideal fit for this vocation.

‘నాకు సిగ్గు చాలా ఎక్కువ. ఆ సిగ్గు వల్ల నేను రాజకీయాలకు పనికిరాను. రాజకీయ నేతలు ఎక్కడుంటే అక్కడ జనాలు బాగా పోగై వుంటారు. నా చుట్టూ అంతమంది వుంటే నేను చాలా అసౌకర్యంగా ఫీలవుతాను. నాకు కెమెరా ముందు ఎలాంటి బెరుకు వండదు కానీ రాజకీయాలంటే ఒక రకమైన సిగ్గుతో కూడుకున్న భయం వుంది. రాజకీయాలనేది ప్రజల వృత్తి. ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో వారంతా తప్పకుండా ప్రజలతో మమేకం కావాలి. నాలాంటి సిగ్గుబోతు రాజకీయాలకు అస్సలు సూట్ అవడు. సన్నీ డియోల్, ఊర్మిళకు నా అభినందనలు. వాళ్లు ఓ మంచి ఆలోచనతోనే ఇంతగొప్ప నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ప్రజలు కోరుకుంటున్న మార్పు వారు తీసుకొస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపాడు అజయ్.

ప్రస్తుతం అజయ్ ‘దే దే ప్యార్‌ దే’ సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. అకీవ్‌ అలీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అజయ్ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, టబు నటించారు. మే 17న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.