తేజో మహాలయం అనే శివాలయాన్ని కూల్చి తాజ్ మహల్ కట్టారని, అది దేశానికి మచ్చ అని హిందూత్వ అతివాదులు లేవనెత్తిన వివాదానికి తెరపడకముందే మరో మొగల్ కట్టడంపై రచ్చ మొదలైంది.
తాజ్‌ను కట్టించిన షాజహాన్ ముత్తాత హుమయూన్ సమాధిని కూలగొట్టాలని యూపీ షియా నేత ఒక ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఈ సమాధిని నేలమట్టం చేస్తే.. ముస్లింల శవాలను పూడ్చడానికి పెద్ద విస్తీర్ణంలో స్థలం లభిస్తుందని వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీమ్ రిజ్వీ ఆ లేఖలో వివరించారు.
లేఖలోని సారాంశం.. ‘ దేశంలో ముస్లింలు చనిపోతే వారిని ఖననం చేయడానికి స్థలం సరిపోవట్లేదు. ఢిల్లీలో అయితే సమస్య తీవ్రంగా ఉంది. 200 ఎకరాల్లో ఉన్న హుమాయున్ సమాధిని తొలగిస్తే దాన్న ఖబరస్థాన్గా వాడుకోవచ్చు.
ఇంకో పదేళ్లు శ్మశాన అవసరాలు తీరతాయి. హుమాయూన్ రాజే కావచ్చు. కానీ ఆయన పోయాక రాజూ, పేదా తేడా ఏమిటి? ఈ సమాధిని కూలగొడితే ఆయన పాపాలకు కొంతయినా ప్రాయశ్చిత్తం కలుగుతుది. దేశ సంపదను దోచుకుని, ప్రజలను చిత్రవధ చేసిన ఇలాంటి రాజు సమాధులపై పైసా ఖర్చు పెట్టొద్దు.’ అని రిజ్వీ అన్నారు. తాజ్ మహల్ గురించి రాస్తూ.. అది సమాధి కాదని, అందమైన ప్రపంచ వింత కనుక దాన్నలాగా ఉండనివ్వాలన్నారు.