IMD betters monsoon forecast at 103 Percent of average
mictv telugu

మరో శుభవార్త చెప్పిన ఐఎండీ.. ఈ ఏడాది అత్యధిక వర్షపాతం

May 31, 2022

IMD betters monsoon forecast at 103 Percent  of average

సాధారణంగా జూన్ 1న నైరుతి రుతపవనాలు కేరళ తీరాన్ని తాకుతుంటాయి. అయితే ఈసారి మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రుతుపవనాల సీజన్‌లో ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని రత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం తెలిపింది.

మునపటి అంచనాలను సవరిస్తూ.. ఈ ఏడాది దేశంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. ఈ రుతుపవనాల సగటు వర్షపాతం దీర్ఘకాల సగటులో 103 శాతం ఉంటుందని అంచనా వేయబడిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర విలేకరుల సమావేశంలో తెలిపారు. నైరుతి ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని.. దీర్ఘకాల సగటులో 99 శాతం మాత్రమే వానలు పడొచ్చని ఐఎండీ ఈ ఏడాది ఏప్రిల్‌లో చెప్పిన సంగతి తెలిపిందే. రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో ఐఎండీ అంచనాలను సవరించింది. మధ్య, ఉత్తర భారతదేశంలో దీర్ఘకాలం సగటు వర్షపాతంలో 106 శాతం వర్షాలు కురుస్తాయని మోహపాత్ర తెలిపారు. ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.