గతిలేక భారత్‌ను బతిమాలుతున్నాం : ఐఎంఎఫ్ చీఫ్ - MicTv.in - Telugu News
mictv telugu

గతిలేక భారత్‌ను బతిమాలుతున్నాం : ఐఎంఎఫ్ చీఫ్

May 25, 2022

గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన భారత ప్రభుత్వాన్ని ప్రపంచం తరపున నిషేధం ఎత్తివేసేలా బతిమాలుతున్నామని ప్రపంచ బ్యాంకు అధ్యక్షురాలు క్రిస్టలీనా జార్జియేవా తెలిపారు. నిషేధంపై భారత్ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. దావోస్ వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, వేసవిలో దిగుబడులు తగ్గిపోవడం, దేశీయంగా ధరలు పెరిగే అవకాశముండడంతో భారత్ గోధుమ ఎగుమతులను నిలిపివేసింది. దీంతో మరి కొన్ని ఎగుమతి దేశాలు కూడా భారత్ బాటలో పయనించే అవకాశముంది. ఇలా గనుక జరిగితే ప్రపంచంలో వ్యవసాయం అంతంత మాత్రంగా ఉన్న దేశాలలో ఆకలి కేకలు పెరిగిపోతాయి. దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆహార పదార్ధాల కొరత ఏర్పడింది. దీంతో ప్రత్యక్షంగా భారత్ ఎగుమతులపై ఆధారపడి జీవిస్తున్న లెబనాన్, ఈజిప్ట్ దేశాలలో అశాంతి పెరిగే ప్రమాదముందిన ఆమె ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ ఆహార భద్రత, స్థిరత్వంలో భారత్ పాత్రను ప్రశంసించారు. అలాగే భారత్‌ పరిస్థితిని అర్ధం చేసుకోగలమని, కానీ, ప్రపంచంలో ఏర్పడబోయే సంక్షోభాన్ని కూడా భారత్ గుర్తించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.