Immersion of Ganesha of Khairatabad is complete
mictv telugu

కన్నుల పండుగగా… ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం

September 9, 2022

కన్నుల పండుగగా...    ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం

పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా ఈ ఏడాది దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. భక్తజన కోలాహలం, కేరింతలు, డప్పుల దరువులు, సాంప్రదాయ నృత్యాలతో శోభాయాత్రగా తరలివచ్చి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం అయ్యాడు. ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన నాలుగో నెంబర్ క్రేన్ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేశారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర విజయవంతంగా సాగింది. అనంతరం ఉత్సవ సమితి సభ్యులు తుది పూజలు చేసి నిమజ్జన క్రతువును పూర్తి చేశారు. 50 అడుగుల ఎత్తయిన మహా గణపతిని 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు, 26 టైర్ల టస్కర్ వాహనంలో తరలించారు. అటు చివరి రోజు కావడంతో గణపతిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.