ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సినిమా టికెట్లను బుక్ చేసుకోవడం కోసం ప్రభుత్వం తరుపున యువర్ స్క్రీన్స్ అనే పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లను బుక్ చేసుకోవడం వల్ల ఎలాంటి అదనపు చార్జీల భారం ఉండదని ఏపీఎఫ్డీసీ ఎండీ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఎండీ విజయ్ కుమార్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..”ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్ల విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యువర్ స్క్రీన్స్ పేరిట ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. ఈ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు బుక్ చేసుకుంటే అదనపు చార్జీలు పడవు. అంతేకాకుండా బ్లాక్ టికెటింగ్‌కు అడ్డుకట్ట పడుతుంది. ప్రేక్షకులకు తక్కువ ధరలకే సినిమా టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే సినిమా టికెట్ల అమ్మకాలు జరుగుతాయి” అని ఆయన అన్నారు.
‘యువర్ స్క్రీన్స్’ అనే పోర్టల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే ధరపై 1.95 శాతం మాత్రమే సేవా రుసుము ఉంటుంది. ఇతర ఆన్లైన్ పోర్టళ్ల ద్వారా బుక్ చేసుకుంటే ఒక్కో టికెట్‌పై ప్రేక్షకుడికి అదనంగా రూ.20 నుంచి రూ.25 వరకూ భారం పడుతుంది. ఈ భారాన్ని అదుపుచేసేందుకు ప్రభుత్వం ‘ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ’తో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన యువర్ స్క్రీన్స్ ద్వారా కూడా ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకోవొచ్చు’