అభ్యర్థులకు ముఖ్య గమనిక.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థులకు ముఖ్య గమనిక.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి

May 4, 2022

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ఇటీవలే విడుదలైన పోలీసు ఉద్యోగాలకు సోమవారం నుంచి ఆల్‌లైన్‌లో దరఖాస్తులు మొదలైన విషయం తెలిసిందే. ఈ పోలీసు ఉద్యోగాలకు ఆప్లై చేసే అభ్యర్థులు దరఖాస్తుకు ముందే రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ”తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు దరఖాస్తుకు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల్లో వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) మాదిరిగానే తొలుత టీఎస్ఎల్పీఆర్‌బీ వెబ్‌సైట్లో అభ్యర్ధులు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది. కాబట్టి ప్రాథమిక వివరాలతో మొదట రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తేనే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది” అని తెలిపారు.

మరోపక్క ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 2018లో వచ్చిన నోటిఫికేషన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఈసారి అంతకన్నా ఎక్కువగానే దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. కావున ఇందుకు తగ్గట్టుగానే సర్వర్లలో ఏలాంటి లోపాలు తలెత్తకుండా సాంకేతిక సిబ్బందిని సిద్ధం చేశారు. తొలిరోజే ఈ పోలీసు ఉద్యోగాలకు 15వేల దరఖాస్తులు వచ్చాయని వివరాలు వెల్లడించారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకుంటే గనుక అభ్యర్థులు ఏ సామాజికవర్గానికి చెందినా వారైనా సరే ఓసీలుగానే పరిగణిస్తామని పేర్కొన్నారు. కొత్త ప్రెసిడెన్షియల్ నిబంధనల ప్రకారం ఉద్యోగ నియామకాల్లో అయిదు శాతం మాత్రమే నాన్ లోకల్ కేటగిరీగా పరిగణిస్తామని తెలిపారు. కావున అభ్యర్థులు ఫోన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని అధికారులు సూచించారు.