రైతులకు ముఖ్య గమనిక: ప్రధాని మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

రైతులకు ముఖ్య గమనిక: ప్రధాని మోదీ

March 5, 2022

02

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ కింద ఆర్థిక భరోసా అందిస్తున్న సందర్భంగా ప్రతి రైతు పీఎం కిసాన్ వెబ్ సైట్‏లో eKYCని అప్డేట్ చేయడం తప్పనిసరి అని ప్రకటించింది. అలాగే రైతులు తమ పీఎం కిసాన్ ఖాతాలకు ఆధార్ లింక్ చేయడం కూడా తప్పనిసరి అని పేర్కొంది. ఇందుకు రైతులు సీఎస్సీ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఓటీపీ ఆధారిత ఆధార్ కార్డ్ లింక్ చేయవచ్చు అని తెలిపింది. ఇందుకోసం రైతులు తమ ఆధార్ వివరాలను పీఎం కిసాన్ వెబ్ సైట్‌లో ఎంటర్ చేయడం ఎలా? ఏ విధంగా ఆధార్ లింక్ చేయాలి? ఏ విధంగా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలి అనే వివరాలు మీకోసం.

పీఎం కిసాన్‌కు ఆధార్ లింక్ ఎలా చేయాలి..

1. ముందుగా పీఎం కిసాన్ వెబ్ సైట్ లాగిన్ కావాలి.
2. హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్ పై క్లిక్ చేయాలి.
3. ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
4. ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్, బ్యాంక్ అకౌంట్, ఫార్మర్ నంబర్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి.
5. ఆధార్ నంబర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
6. ఆ తర్వాత అవసరమైన వివరాలను ఎంటర్ చేసి అప్డేట్‌పై క్లిక్ చేయాలి.
7. దీంతో ఆధార్ వివరాలు అప్డేట్ అవుతాయి. పీఎం కిసాన్ ఖాతతో ఆధార్ కార్డ్ లింక్ అవుతుంది. దీంతో అన్ని వివరాలు అప్డేట్ అవుతాయి.
8. ఒకవేళ ఓటీపీ ఎర్రర్ వస్తే రైతులకు బదులు.. వారి బయోమెట్రిక్‏లను అప్డేట్ చేయడానికి సీఎస్సీ కేంద్రాలను సందర్శించాలి.

eKYCని అప్డేట్ చేయడం ఎలా..

1. ముందుగా పీఎం కిసాన వెబ్‌సైట్ లాగిన్ కావాలి.
2. ఆ తర్వాత రైట్ సైడ్ పైన కనిపించే eKYC ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3. ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
4. ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
5. ఆ తర్వాత ఓటీపీ పొందండి పై క్లిక్ చేసి ఓటీపీని ఎంటర్ చేయాలి.
6. కొన్నిసార్లు ఓటీపీ ఎంటర్ చేయడంలో సమస్యలు తలెత్తవచ్చు. టైమ్ అవుట్. వంటి ఎర్రర్ వస్తుంది.