గ్రూప్-1 అభ్యర్థులకు ముఖ్య గమనిక.. పుస్తకాల్లో మార్పులు - MicTv.in - Telugu News
mictv telugu

గ్రూప్-1 అభ్యర్థులకు ముఖ్య గమనిక.. పుస్తకాల్లో మార్పులు

May 11, 2022

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలుగు అకాడమీ అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. గ్రూప్-1కు సంబంధించిన రెండు పుస్తకాల్లో స్వల్ప మార్పులు చేశామని తెలిపారు. తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీలో వర్తమాన అంశాలను చేర్చామని పేర్కొన్నారు. మరో 9,10 రోజుల్లో తెలుగు అకాడమీ ఎకానమీ పుస్తకం అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

అధికారులు మాట్లాడుతూ.. ”గ్రూప్-1 పాఠ్యాంశాల్లో తెలుగు అకాడమీ స్పల్ప మార్పులు చేసింది. తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలకు చోటు కల్పించింది. ఇప్పటికే తెలంగాణ జాగ్రఫీ పుస్తకం విడుదలైంది. మరో పదిరోజుల్లో ఎకానమీ పుస్తకం కూడా వస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో భౌగోళిక స్వరూపం మారిపోయింది. పట్టణాలు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చెందాయి. వాటన్నింటిపై ప్రశ్నలడిగే అవకాశముంది. పెద్ద జిల్లా, చిన్న జిల్లా, అక్షరాస్యత రేటు, లింగ నిష్పత్తి వంటి అంశాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిని జాగ్రఫీ పుస్తకాల్లో చేర్చాం. ఎకానమీ సబ్జెక్టులో బడ్జెట్‌పై చాలా ప్రశ్నలు ఉంటాయి. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ వివరాలను ఎకానమీ పుస్తకాల్లో చేర్చాం. తాజా జీఎస్టీపీ, తలసరి ఆదాయం గణాంకాలు, సెక్టోరల్ ట్రెండ్స్, సర్వీస్ సెక్టార్ ట్రెండ్స్, పరిశ్రమలకు ప్రోత్సాహ కాలు, పారిశ్రామిక పాలసీ వివరాలను చేర్చాం. తాజా ఆర్థిక సర్వే, కాగ్ నివేదికల్లోని ముఖ్యాంశాలను పాఠ్యాంశాల్లో చేర్చాం.”