హైదరాబాద్ వాహనదారులకు ముఖ్య గమనిక.. సీవీ ఆనంద్ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ వాహనదారులకు ముఖ్య గమనిక.. సీవీ ఆనంద్

April 21, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఓ విషయాన్ని తెలియజేశారు. ఏప్రిల్ 21 నుంచి జూన్ 4 వరకు పికెట్ నాలా పునర్నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను చేపట్టనున్నామని తెలిపారు. సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డు, మినిస్టర్ రోడ్డులోని ప్యాట్నీ నాలా వంతెన పునర్నిర్మాణానికి అధికారులు నిర్ణయం తీసుకున్నా నేపథ్యంలో ఈ నిబంధనలు అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..”సికింద్రాబాద్ సీటీవో నుంచి రసూల్‌పుర జంక్షన్ వైపు వచ్చే వాహనాలు హనుమాన్ దేవాలయం (యాత్రి నివాస్) వద్ద ఎడమకు తిరిగి, పీజీ రోడ్డు మీదుగా ఫుడ్ వరల్డ్, రాంగోపాల్ పేట్ ఠాణా, మినిస్టర్ రోడ్డుల మీదుగా రసూల్‌పుర జంక్షన్‌కు వెళ్లాలి. బేగంపేట్ ఫ్లై ఓవర్ నుంచి వచ్చే ట్రాఫిక్ కిమ్స్ ఆసుపత్రి రసూల్‌పురా టీ జంక్షన్ నుంచి కుడివైపు మలుపు తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదు.

నేరుగా సీటీఓ జంక్షన్ వైపు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఎస్పీరోడ్డు హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్ వరల్డ్ రాంగోపాల్ పేట్ రాణా మీదుగా రసూల్ పురా టీ జంక్షన్‌కు వెళ్లే దారి వన్వెగా ఉంటుంది. గూడ్స్ వాహనాలు, రవాణా వాహనాలు సికింద్రాబాద్ నుంచి సోమాజీగూడ వైపు వెళ్లేందుకు ఈ మార్గంలో అనుమతి లేదు. ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలి. పంజాగుట్ట వైపు నుంచి వచ్చే వాహనాలు బేగంపేట్ ప్లే ఓవర్ కింద యూ టర్న్ తీసుకుని హనుమాన్ టెంపుల్ లేన్ నుంచి ఫుడ్ వరల్డ్, రాంగోపాల్ పేట్ రాణా వద్ద ఎడమ వైపు నుంచి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాలి. వాహనదారులు ఈ మార్పులు గమనించి, పోలీసులకు సహకరించాలి” అని ఆయన కోరారు.