Important note for SBI customers..Cash only by doing this
mictv telugu

ఎస్‌బీఐ ఖాతాదారుల్లారా..ఓటీపీ టైప్ చేస్తేనే నగదు

July 28, 2022

దేశవ్యాప్తంగా ఉన్న వినియోగాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. ఇక నుంచి ఎస్‌బీఐ ఖాతాదారులు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఓటీపీ నమోదు చేస్తేనే నగదు చేతికి వస్తుందని తెలిపింది. రూ.10 వేలకు మించి నగదు ఉపసంహరణ అమల్లోకి తెచ్చినట్లు ఎస్బీఐ పేర్కొంది. అయితే, ఎలా ఓటీపీ వస్తుంది? దాని ప్రాసెస్ ఏంటీ? అనే వివరాలను వెల్లడించింది.

”ఎస్బీఐ బ్యాంక్ వినియోగాదారులు ఏటీఎం మోసాల బారినపడకుండా చూడాలన్న లక్ష్యంతో ఈ ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చాం. ఇక నుంచి ఖాతాదారులు ఏటీఎం నుంచి రూ. 10 వేలకు మించి నగదు తీసుకోవాలంటే కచ్చితంగా ఓటీపీని టైప్ చేస్తేనే డబ్బులు చేతికి వస్తాయి. ఈ ఓటీపీ అనేది బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేసిన టైంలో ఏ మొబైల్ నంబరు అయితే ఇచ్చారో ఆ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఖాతాదారుడు నగదు కోసం ఏటీఏంకి వెళ్లి, ఇన్ని డబ్బులు కావాలని టైప్ చేసిన వెంటనే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ వచ్చే ఓటీపీని సరిగా టైప్ చేయకపోతే..ఏటీఎం నుంచి నగదు బయటకు రాదు. ఒక ఓటీపీ ద్వారా ఒకే లావాదేవీ చేసేందుకు వీలవుతుంది” అని అధికారులు తెలిపారు.

అయితే, ఖాతాదారుడి ఖాతాలో రూ.లక్షకు మించి ఉంటే, అపరిమిత ఉపసంహరణలు తమ బ్యాంకు ఖాతాలో రూ. లక్షకు మించి నగదు నిల్వ ఉంటే, ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఎన్నిసార్లయినా నగదును ఉపసంహరించే వీలుందని తాజా నోటిఫికేషన్లో ఎస్బీఐ తెలిపింది. రూ. లక్ష కంటే తక్కువ మొత్తం ఉంటే మాత్రం 5 ఉచిత లావాదే వీలనే అనుమతిస్తామని వెల్లడించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 3 సార్లు మాత్రమే ఉచితంగా అనుమతిస్తామని, అంతకుమించితే ప్రతి లావాదేవీకి ఛార్జి పడుతుందని అధికారులు వివరించారు.