టెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక..పరీక్ష కేంద్రాల్లోనే.. - MicTv.in - Telugu News
mictv telugu

టెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక..పరీక్ష కేంద్రాల్లోనే..

June 7, 2022

తెలంగాణ రాష్ట్రంలోని టెట్ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న 33 జిల్లాల అభ్యర్థులకు కేసీఆర్ సర్కార్ ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. జూన్ 12న జరగబోయే టెట్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను సోమవారం నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అధికారులు పొందుపరిచారు. అయితే, టెట్ హాల్ టికెట్లలో ఎమైనా తప్పులుంటే వాటిని పరీక్ష కేంద్రాల్లోనే సరిచేసుకోవాలని కన్వీనర్ రాధారెడ్డి అన్నారు. హాల్ టికెట్లలో అభ్యర్థి పేరు, తండ్రి/తల్లి పేరు, పుట్టిన తేదీ, కులం, లింగం, డిసెబిలిటీ (పీహెచ్‌సీ) వంటి వివరాలు సరిగా లేకపోతే, పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.. హాల్ టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేకపోయినా, అస్సలు లేకపోయినా అభ్యర్థులు ఇటీవలి ఫొటోను అతికించి, గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్ చేయించుకొని, జిల్లా విద్యాశాఖాధికారిని సంప్రదించాలని ఆయన అభ్యర్థులకు సూచించారు.

మరోపక్క టెట్ పరీక్షకు సంబంధించి పరీక్షా కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. 33 జిల్లాల్లోనూ అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు సెంటర్లను అలాట్ చేశారు. అత్యధికంగా హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు మొత్తం 6,29,352 అప్లికేషన్లు అందాయని, వీటిలో పేపర్ 1కు 3.51,468, పేపర్ 2కు 2,77,884 మంది దరఖాస్తు చేసినట్లు వివరాలు వెల్లడించారు. టెట్ ఎగ్జామ్‌ను ఐదేండ్ల తర్వాత పెట్టడంతో అధికారులు ఈసారి బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు అవకాశమిచ్చారు. ఈ కారణంగా ఈసారి భారీగా అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు.