తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్య గమనిక - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్య గమనిక

March 11, 2022

nggnbdf

తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన నిరుద్యోగుల ఆశలు చిగురించాయి. దీంతో కొంతమంది కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. మరికొంతమంది ఇంట్లో ఉండే ప్రిపర్ అవుతున్నారు. ఇంకొంతమంది తాజాగా డీగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగాలకు సన్నద్దమవుతున్నారు. అలాంటి వారికోసం తెలంగాణ ప్రభుత్వం ఓ ముఖ్యమైన సమాచారాన్ని తెలిపింది. టీఎస్‌పీసీలో రిజిస్ట్రేషన్‌ చేసుకోనివారు. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని సూచించింది. మరి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఆ వివరాలను తెలుసుకుందామా..

ఇలా చేయండి..

1. ముందుగా అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2. అనంతరం హోమ్‌ పేజీలో కనిపించే ‘వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌’ పైన క్లిక్‌ చేయాలి.
3. వెంటనే టీఎస్‌పీఎస్‌ ఓటీఆర్‌ పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
4. అనంతరం అభ్యర్థుల ప్రాథమిక వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
5. అనంతరం అడ్రస్‌ వివరాల్లో భాగంగా శాశ్వత నివాసాన్ని ఎంటర్‌ చేయాలి.
6. తర్వాత విద్యార్హతలకు సంబంధించిన వివరాలతో పాటు సంబంధిత సర్టిఫికేట్స్‌ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
7. అనంతరం ఫోటో, సంతకం అప్‌లోడ్‌ చేయాలి.
8. చివరిగా ప్రివ్యూ బటన్‌పై క్లిక్‌ చేసి ఎంటర్‌ చేసిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని సబ్‌మిట్‌ నొక్కితే టీఎస్‌పీఎస్‌సీ ఐడీ జనరేట్‌ అవుతుంది.
9. భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే. ఈ ఐడీ ఎంటర్‌ చేసి నేరుగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.