Important note to devotees..these rules are mandatory
mictv telugu

భక్తులకు ముఖ్య గమనిక..ఈ రూల్స్ తప్పనిసరి

September 1, 2022

తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో వినాయక చవితిని పురస్కరించుకుని వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించిన నిర్వాహకులకు, భక్తులకు పోలీసు శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు కొన్ని ముఖ్యమైన నిబంధనలను తెలియజేశారు. ఈ నవరాత్రులు సజావుగా జరిగేందుకు శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, గణేశ్‌ ఉత్సవ కమిటీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడుదల చేశారు.

తప్పక పాటించాల్సిన రూల్స్ ఇవే..

1. గణేశ్‌ మండపాలను ఇరుకైన వీధుల్లో ఏర్పాటు చేయరాదు.
2. మండపాల వద్ద మద్యం, జూదం ఆడరాదు.
3. మండపం వద్ద ముగ్గురు వలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి.
4. మండపాలను గాలి, వానకు కూలిపోకుండా పకడ్బందీగా నిర్మించాలి.
5. రద్దీగా ఉండే మండపాల వద్ద బారికేడ్లు ఏర్పా టు చేయాలి.
6. మండపంలోకి ఎలాంటి మండే పదర్థాలు గానీ పటాకులు ఉంచకూడదు.
7. నూనెతో వెలిగించే దీపాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.
8. మండపాల వద్ద తప్పనిసరిగా వీడియో కెమెరాలు, సీసీటీటీలు ఏర్పాటు చేసుకోవాలి.
9. ఆగస్టు 31న నుంచి సెప్టెంబర్‌ 11వ తేదీ 6 గంటల వరకు బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై క్రాకర్లు కాల్చడం, పేల్చడం నిషేధం.
10. సౌండ్‌ బాక్స్‌లను స్థానిక డీఎస్పీ అనుమతి లేకుండా ఉపయోగించరాదు.
11. మండపం వద్ద ఒక బాక్స్‌ టైపు స్పీకర్‌ మాత్రమే.
12. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్‌స్పీకర్లు, పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌లను ఉపయోగించకూడదు.

ఇక విద్యుత్ శాఖ రూల్స్ ఇవే..

వినాయక నవరాత్రులను పురస్కరించుకుని మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు సూచించారు. మండపాల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే విద్యుత్‌ తీగలతో అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. పూర్తిగా నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో షార్ట్‌ సర్క్యూట్‌లు, విద్యుత్‌ షాక్‌లు తగిలితే ఆస్తి, ప్రాణనష్టం జరిగే ప్రమాదముందని తెలియజేశారు. ”మండపాల విద్యుద్దీకరణ పనులు లైసెన్స్‌డ్‌ ఎలక్ట్రిక్‌ కాంట్రాక్టర్‌ ద్వారా మాత్రమే చేపట్టాలి, విద్యుత్‌ సరఫరా కోసం ఎర్త్‌ లీకేజ్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌గా అమర్చుకోవాలి. లైన్ల నుంచి వచ్చే వైర్ల నుంచి మండపానికి సరఫరా అయ్యే చోట ఈ బ్రేకర్‌ను అమర్చుకోవాలి” అని తెలిపారు.