ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య సూచన - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య సూచన

March 19, 2022

10

ఎస్‌బీఐ బ్యాంకు తన ఖాతాదారులకు ఓ ముఖ్యమైన సూచనను తెలిపింది. ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులకు విజ్జప్తి చేసింది. కెవైసీ మోసానికి సంబంధించి 44 కోట్ల మంది కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఎస్‌ఎంఎస్ ద్వారా పంపిన ఎంబెడెడ్ లింక్‌లపై క్లిక్ చేయవద్దని వినియోగదారులను హెచ్చరించింది. మీ మొబైల్‌కి బ్యాంకు పేరుతో ఎటువంటి లింక్‌లు వచ్చినా క్లిక్‌ చేయవద్దని సూచించింది.

అంతేకాకుండా పంపిన ఎంబెడెడ్ లింక్‌పై SMSద్వారా KYCని అప్‌డేట్ చేయమని తమ కస్టమర్‌లను ఎప్పుడూ అడగదని బ్యాంక్ తెలిపింది. ఈ సందర్భంగా ”దేశంలో డిజిటల్ లావాదేవీల పెరుగుదలతో, ఆన్‌లైన్ మోసాల కేసులు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు కొత్త మార్గాల్లో వినియోగదారులను మోసం చేస్తున్నారు. కొన్నిసార్లు లాటరీలు QRకోడ్‌ల ద్వారా ప్రజలను తమ బాధితులుగా మారుస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ట్విట్‌లో, #YehWrongNumberHai, KYC మోసానికి సంబంధించి ట్విట్ చేసింది. అపరిచిత లింక్‌లపై క్లిక్ చేయవద్దు. SMS అందుకున్నప్పుడు ఎస్‌బీఐదా కాదా అని తనిఖీ చేయండి” అని తెలిపింది.

మరోవైపు మోసగాళ్లు పంపిన లింక్‌లపై క్లిక్‌ చేస్తే మీ బ్యాంకు ఖాళీ అవుతుందని పేర్కొంది. మీరు కేవైసీ చేయాల్సి వస్తే సదరు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చేయండని లేదా సమీపంలో ఉన్న బ్యాంకును సంప్రదించండి అని కోరింది. QR కోడ్‌ల ద్వారా జరుగుతున్న మోసాల గురించి ఇంతకు ముందు దేశంలోని అతిపెద్ద బ్యాంక్ కస్టమర్‌లను అప్రమత్తం చేస్తున్నామని తెలిపింది. మీరు ఎవరి నుండి ఏదైనా క్యూఆర్ కోడ్ పొందినట్లయితే, పొరపాటున కూడా స్కాన్ చేయవద్దని బ్యాంక్ తెలిపింది. కావున వినియోగదారులు ఈ విషయాన్ని మర్చిపోవద్దని, అపరిచిత లింక్‌లపై క్లిక్ చేసి, మీ డబ్బును పొగొట్టుకోవద్దని కోరింది.