మందుకొడితే నిజంగానే మంచి భాష! - MicTv.in - Telugu News
mictv telugu

మందుకొడితే నిజంగానే మంచి భాష!

October 19, 2017

ఎవరైనా కాస్త మాట తూలితే.. ‘ఏం మందుకొట్టి మాట్లాడుతున్నావా?’ అని తిడతాం. మందుకొడితే భాష సరిగ్గా ఉండదని మన నిశ్చితాభిప్రాయం. అయితే మందు తాగితే భాషా ప్రావీణ్యం పెరుగుతుందని అంటున్నారు పరిశోధకులు.

మద్యం సేవించిన వారిలో భాష మెరుగ్గా ఉంటుందని డచ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా రెండుమూడు భాషలు మాట్లాడేవారు మద్యం తాగితే మేలట. అయితే ఎక్కువగా కాకుండా తగిన మోతాదులో తీసుకోవాలి. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని, ఆందోళన తగ్గుతుందని, వారు చేసే పనుల్లో పకడ్బందీగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు.

 50 మంది తాగుబోతులపై ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా ఆయా వ్యక్తుల శరీర బరువులో 5 శాతం బీరు కొట్టించి భాషలో వారి నైపుణ్యాలను అధ్యయనం చేశారు. వారిని కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మందుబాబులు వారడిన ప్రశ్నలకు జవాబులిచ్చి రెండు భాషల్లో తాము నిష్ణాతులమని రుజువు చేసుకున్నారు.