బాద్ షాహో.. ఇమ్రాన్ హాష్మీ ! - MicTv.in - Telugu News
mictv telugu

బాద్ షాహో.. ఇమ్రాన్ హాష్మీ !

July 25, 2017

ఇమ్రాన్ హాష్మి, అజయ్ దేవ్ గన్ హీరోలుగా, మిలన్ లుథ్రియా డైరెక్షన్ లో వస్తున్న ‘ బాద్ షాహో ’ సినిమా ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. కారణం సన్నిలియోని ఇందులో స్పెషల్ సాంగ్ చేసింది. టీజర్ లో సన్నిలియోని, ఇమ్రాన్ లను చూసిన ఆడియన్స్ ఈ క్రేజీ సినిమా మీద చాలా ఎగ్జైటింగ్ గా వున్నారు. ఇలియానా, ఇషాగుప్తా హీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 నాడు రిలీజ్ అవనుంది. ఆ తర్వాత ఇమ్రాన్ హాష్మి సినిమాలు వర్సగా ఈ ఏడాది చివరి వరకు 4 రిలీజ్ అవ్వొచ్చు. వాటిలో ‘ కెప్టెన్ నవాబ్ ’ , మర్డర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హాష్మీ దానికి స్వీక్వెల్స్ చేస్తూనే వున్నాడు. ఇప్పుడు ఆ కోవలోనే ‘ మర్డర్ 4 ’ కూడా ఈ ఏడాది చివర వరకు రావచ్చంటున్నారు. మహేష్ భట్, విక్రమ్ భట్ లు ఈ థ్రిల్లర్ ప్రాజెక్టును అత్యంత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారట. అలాగే ‘ టైగర్స్ ’ కూడా ఈ ఏడాది లేదా 2018 జనవరిలో వచ్చే అవకాశాలున్నాయంటున్నారు బాలీవుడ్ బాతాఖానీలు.

చూడాలైతే ఈ ఏడాది ఇమ్రాన్ హాష్మీ కి ఈ నాలుగు సినిమాలు ఏ మేరకు కలిసొస్తాయో. సినిమాలు చేయటంలో స్పీడు పెంచిన ఇమ్రాన్ కు ఈ ఏడాది ఎండింగ్, వచ్చే ఏడాది స్టార్టింగ్ మంచి రిజల్టునిస్తుందేమో. ప్రస్తుతం అందరి దృష్టి తాజా బాద్ షాహో సినిమా మీదే వుంది. సన్నిలియోని స్పెషల్ అప్పీరియన్స్ గా వస్తున్నే ఈ సినిమా తప్పకుండా మంచి ఫలితాన్నిస్తుందనే ఆశాభావంలో వున్నాడు ఇమ్రాన్ హాష్మి.

 

http://www.ilubilu.com/emraan-hashmi-upcoming-movies.html