పాక్ ప్రధాని అహంకారం.. భారత్‌పై నిందలు - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ ప్రధాని అహంకారం.. భారత్‌పై నిందలు

May 28, 2020

Imran Accuses on India Border Issue

భారత్‌పై తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ.. రాజకీయ పబ్బం గడుపుకునే పాక్ పాలకులు మరోసారి నోటికి పని చెప్పారు. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బార్డర్‌లో భారత్‌ను భూచిగా చూపే ప్రయత్నం చేశారు. సరిహద్దు అంశాలపై తన ట్విట్టర్‌లో అనవసర నిందారోపణలు చేశారు. భారత ప్రభుత్వం దురహంకారపూరిత విస్తరణ కారణంగా పొరుగు దేశాలకు ఇబ్బందిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఈ వ్యాఖ్యలపై భారత నెటిజన్లు భగ్గుమంటున్నారు. 

ఇటీవల చైనా, నేపాల్‌తో భారత్ మధ్య సాగుతున్న సరిహద్దు వివాదాలపై ఆయన ఈ విధంగా స్పందించారు. భారత ప్రభుత్వం తీరు వల్ల పొరుగున ఉన్న దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. తరుచూ సరిహద్దు విస్తరణ చేపట్టడం వల్ల పొరుగు దేశాలన్నింటికీ ముప్పేనని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. పౌరసత్వ చట్టం, నేపాల్‌తో సరిహద్దు వివాదం, ఫ్లాగ్ ఆపరేషన్ చేపట్టి భారత్ ప్రమాదకారిగా మారిందని నిందలు వేశారు. దీంతో ఆయన ట్వీట్ వైరల్ కావడంతో వివాదస్పదంగా మారింది. మరి దీనికి భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.