రాక్షస రేపిస్ట్ ఖతం.. మృతురాలి తండ్రి ముందే ఉరి..   - MicTv.in - Telugu News
mictv telugu

రాక్షస రేపిస్ట్ ఖతం.. మృతురాలి తండ్రి ముందే ఉరి..  

October 17, 2018

మనదేశంలోనే కాదు మొత్తం ప్రపంచమంతటా మహిళలపై, బాలికలపై అత్యాచారాలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయి. చట్టాల్లో లొసుగులు, జాప్యం. .మరెన్నో కారణాల వల్ల దోషులకు శిక్షలు పడ్డం లేదు. పడినా చాలా చాలా ఆలస్యంగా పడుతున్నాయి. దోషులను జాప్యం లేకండా శిక్షిస్తే నేరాలు కొంతవరకైనా తగ్గుతాయి. నేరప్రవృత్తి ఉన్నవాళ్లు జంకుతారు. పాకిస్తాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించి ఏడేళ్ల బాలికపై హత్యచారం కేసులో అక్కడి కోర్టు కాస్త త్వరగానే శిక్ష విధించింది. ప్రభుత్వం కూడా క్షమాభిక్ష, ఇతర కారణాలతో జాప్యం చేయడకుండా శిక్షను అమలు చేసింది.

imran Ali, who was arrested after her body was found in a garbage dump, was executed in Lahore's Kot Lakhpat prison early on Wednesday, police said.

ఈ కేసులో దోషిగా తేలిని ఇమ్రాన్ అలీని బుధవారం లాహోర్‌లోని కోట్ లఖపత  జైల్లో ఉరి తీశారు.మేజిస్ట్రేట్ ఆదిల్ సర్వర్, బాధిత బాలిక తండ్రి సమక్షంలో అధికారులు.. దోషికి శిక్ష అమలు చేశారు. ఆ తర్వాత ఇమ్రాన్ మృతదేహాన్ని అతని సోదరుడు, స్నేహితులు వచ్చి చూశారు. ఉరిశిక్షకు ముందు ఇమ్రాన్‌‌కు తన  కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతించారు. ఇమ్రాన్ మొత్తం 9 మంది బాలికలపై అత్యాచారం చేసి, దారుణంగా చంపేశాడు. విచారణలో నేరాలను అంగీకరించాడు. దీంతో కోర్టు ఉరి శిక్ష అమలు చేసింది. కాగా, అతన్ని బహిరంగంగా ఉరితీయాలని ఏడేళ్ల బాలిక తండ్రి కోరాడు. అయితే ప్రభుత్వం అందుకంగీకరించలేదు.