అక్కసుతో నల్లరంగు పూసుకున్న ఇమ్రాన్
భారత్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కక్షపూరిత వ్యాఖ్యలు చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. వరుస ట్వీట్‌లతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. భారత్‌తో యుద్ధానికి సిద్ధమని ప్రకటించాడు. జమ్మూ కశ్మీర్‌ను భారత్ ఆక్రమిత కశ్మీర్ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్‌ను కూడా నల్లరంగులోకి మార్చి మరోసారి తన విధ్వేషాన్ని వెళ్లగక్కాడు.
To mark our protest against a growing wave of a Nazi ideology in Modi’s India, and to stand as ambassador for the rights of the people of Kashmir,PM Imran Khan turns his display picture black. Let us all join in;the world does not need Nazi politics of the RSS.#15AugustBlackDay pic.twitter.com/JzIPNQOExU
— PTI (@PTIofficial) August 15, 2019
భారత ప్రజలంతా స్వతంత్య్ర దినోత్సవం జరుపుకుంటుంటే దానిపై కూడా ఇమ్రాన్ ఖాన్ తన అక్కసు వెళ్లగక్కాడు. ఆగస్టు 15ను బ్లాక్ డేగా నిర్వహిస్తామంటూ ప్రకటించాడు. ఇందు కోసం తన ట్విట్టర్ ప్రొఫైల్‌ను నల్లరంగులోకి మార్చాడు. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల విభజన ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి పాక్ విధ్వేషపూరి ప్రసంగాలతో రెచ్చగొడుతోంది. దీనిపై ఐక్యరాజ్య సమితిలో కూడా లేవనెత్తేందుకు సిద్ధమౌతోంది. అయితే పాక్ చర్యలపై భారత్ నుంచి ఎటువంటి కౌంటర్ ఇప్పటి వరకు రాకపోవడం విశేషం.