రూటు మార్చిన ఇమ్రాన్.. ఏకంగా అమెరికానే టార్గెట్..! - MicTv.in - Telugu News
mictv telugu

రూటు మార్చిన ఇమ్రాన్.. ఏకంగా అమెరికానే టార్గెట్..!

September 13, 2019

Imran Khan Comments On America

ఎప్పుడూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా అగ్రరాజ్యం అమెరికాపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఇప్పుడు నీతులు చెబుతున్నారా అంటూ ప్రశ్నించారు. ముజాహిద్దీన్ల‌ను జిహాదీలుగా అమెరికా వాడుకుందని ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్‌ను సోవియేట్ యూనియన్ రష్యా స్వాధీనం చేసుకున్నప్పుడు పాక్‌ను అమెరికా వాడుకుందని అన్నారు. 

80వ ద‌శ‌కంలో జిహాదీల‌కు అగ్రరాజ్యం ఫండింగ్ ఇచ్చిందని ఆరోపించారు. అయితే ఇప్పుడు ఆఫ్ఘ‌నిస్థాన్‌లోకి అమెరికా ద‌ళాలు వ‌చ్చిన త‌ర్వాత అగ్ర‌రాజ్యం త‌న వాద‌న‌ను మార్చేసింద‌న్నారు. ఒక‌ప్పుడు అమెరికా త‌ర‌పున పోరాడిన వారే ఇప్పుడు ఆప్ఘ‌నిస్తాన్‌లో ఉన్నార‌ని, కానీ వాళ్ల‌ను ఇప్పుడు అమెరికా ఉగ్ర‌వాదులుగా చూస్తోంద‌ని ఇమ్రాన్ చెప్పారు. ఉగ్రవాదం విషయంలో అమెరికా కంటే తామే బెటర్ అని వ్యాఖ్యానించారు.ఆ ఉగ్ర‌పోరులో తమ దేశం 70వేల మందిని కోల్పోవడమే కాకుండా ఆర్థికంగా ఎంతో నష్టాన్ని మూటగట్టుకున్నట్టు తెలిపారు. మరి ఈ వ్యాఖ్యలపై అగ్రరాజ్యం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.